హిందువులు జరుపుకునే పెద్ద పండుగలలో శివ రాత్రి (Maha Shivaratri 2023) రోజున ఆలయానికి వెళ్ళి.. ఉపవాసం చేసి.. రాత్రంతా జాగారం చేస్తే.. మంచి జరుగుతుందని, పుణ్యం వస్తుందని, కోరికలు తీరతాయని నమ్ముతారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 18న వస్తుంది.
ఆ రోజు శివాలయాలకు భక్తులు తండోప తండాలుగా వస్తుంటారు. అందులోనూ మధ్య ప్రదేశ్ లోని రేవాలో ఉండే దేవ్ తాలాబ్ శివాలయం అయితే ఇసకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడిపోతుంది. దేవ్ తాలాబ్ శివాలయాన్ని కూడా ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ తరహాలో ఆకర్షణీయంగా అలంకరిస్తారు.
అయితే మన తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లోకి వెళ్ళాలంటే ఎలాంటి డ్రెస్ కోడ్ నిబంధన ఉండదు. మనకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. కానీ రేవాలోని ఈ దేవ్ తాలాబ్ ఆలయంలో మాత్రం డ్రెస్ కోడ్ తప్పని సరి.
దేవ్ తాలాబ్ శివాలయంలోకి జీన్స్, టీ-షర్టు, షార్ట్ స్కర్ట్ వంటి మోడ్రన్ దుస్తులకు అనుమతి లేదు.కేవలం సంప్రదాయ దుస్తులను ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.మహిళలను కూడా చీరలు కట్టుకుంటేనే లోపలికి రానిస్తారు.
మోడ్రన్ డ్రెస్ లు వేస్తే అటు నుంచి అటు ఇంటికి పంపిస్తారు.అలా వారు పెట్టిన నిబందనలు పాటిస్తేనే శివయ్య దర్శించుకునే అవకాశం కల్పిస్తారు.
శివాలయంలోనికి ప్రవేశించడానికి విధించిన ఈ నిబంధనలపై ఇటీ వల మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ రేవా దేవతాలాబ్ ఆలయ నిర్వహణ నిబంధనలను చర్చించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తుల కోసం రూపొందించిన కొన్ని మార్గదర్శకాల గురించి మాట్లాడారు. ఆలయంలోకి రావాలంటే డ్రెస్ కోడ్ పాటించాలని,సంప్రదాయ వస్త్రాలతోనే రావాలని ఆయన స్పష్టం చేశారు.
SDOP సూచనలను అనుసరించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహాశివరాత్రి లోపు ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఆలయంలో డ్రెస్ కోడ్ ఏంటని భక్తులు అధికారులను ప్రశ్నిస్తుండగా.. ఈ డ్రెస్ కోడ్ పై భక్తుల నుంచి మిశ్రమ బావాలు వినిపిస్తున్నాయి.
అయితే డ్రెస్ కోడ్ పెట్టినంత మాత్రాన శివరాత్రికి భక్తులు గుడికి వెళ్ళడం ఆపుతారా.ఆక్కడ జాగారం చేయడం మానతారా.
also read:
UPI for NRIs : విదేశాల నుండి కూడా యుపీఐ పేమెంట్లు..
Yuvaraj: యువరాజ్ అనారోగ్యం గురించి ముందుగానే గుర్తించిన సచిన్.. అతనికి ఎలా తెలిసింది…!