Homeviral newsViral Video: స్కూల్లో ప్రేమాయ‌ణం..క్లాస్‌లోనే అంద‌రి ముందు ప్ర‌పోజ్ చేశాడుగా..!

Viral Video: స్కూల్లో ప్రేమాయ‌ణం..క్లాస్‌లోనే అంద‌రి ముందు ప్ర‌పోజ్ చేశాడుగా..!

Telugu Flash News

Viral Video: ఈ రోజుల్లో చిన్న‌, పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ప్రేమ‌లో ప‌డుతున్నారు. ప్రేమ గురించి తెలియ‌ని వారు కూడా ప్రేమ మాయ‌లో మునిగి తేలుతున్నారు. ప్రేమ ముసుగులో కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

స్కూల్ వ‌య‌స్సులోనే ప్రేమ‌లో ప‌డుతుండ‌డం ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ప్రపంచంలో ప్రేమకు చాలా గుర్తింపు ఉంది. దాంపత్య జీవితంలో ప్రేమలో పంచుకుంటేనే జీవితం అంతా సజావుగా సాగుతుంది. లేకపోతే మనస్పర్ధల వల్ల వివిధ రకాల సమస్యలు సమస్యలు ఉత్ప‌న్నం అవుతాయి.

క్యూట్ ప్ర‌పోజ‌ల్..

చ‌రిత్ర‌లో ప్రేమ‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్రేమ జీవితాల్లో చిరస్థాయిలో మిగిలిపోయేదే. అయితే అంద‌రి మ‌ధ్య ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ‌ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపించుకుంటున్నారు.

అయితే విద్యార్ధి ద‌శలో ప్రేమ‌లో ప‌డ‌డం, ఆ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డం చూస్తుంటే ఈ ప్ర‌పంచం ఎటు వెళుతుందా అని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి ఒక విద్యార్థినికి ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింటే తెగ వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయి. కానీ ఈ వైరల్ అవుతున్న వీడియోకు కొంత ప్రత్యేకత ఉంది అనే చెప్పాలి.

ఈ వీడియోలో గమనించినట్లయితే ఆ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఆ అమ్మాయి కూడా అబ్బాయి అంటే ఇష్టం.. ఇద్ద‌రు చిన్న‌ప్పుడే ప్రేమ‌లో ప‌డ్డారు.

-Advertisement-

అయితే ఆ అబ్బాయి అమ్మాయిని సర్ప్రైజ్ చేయడానికి ఓ పువ్వుతో ఆకస్మాత్తుగా ప్రపోజ్ చేశాడు. దీంతో అమ్మాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ప‌క్క‌న ఉన్న విద్యార్ధులు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు.

మొత్తానికి అబ్బాయి ల‌వ్‌ని యాక్సెప్ట్ చేసిన అమ్మాయి ముఖంలో సంతోషం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ప్ర‌స్తుతం అయితే అమ్మాయికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by 18plusguyy(300k) (@18plusguyy)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News