టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Padayatra) నేటి నుంచి మొదలు కానుంది. పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి గెలుపొందిన నియోజకవర్గమైన కుప్పం నుంచే యువగళం మొదలు పెట్టనున్నారు నారా లోకేష్. కుప్పం మొత్తం పసుపు జెండాలతో నిండిపోయింది. పాదయాత్ర పోలీసుల ఆంక్షలు, షరతుల నడుమ మొదలు పెట్టనున్నారు లోకేష్.
400 రోజులపాటు సుమారు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు లోకేష్. కుప్పంలో భారీ బహిరంగ సభతో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై లోకేష్ గళం విప్పనున్నారు. అంతకుముందు పాదయాత్ర అనుమతులపై పెద్ద హైడ్రామా నడిచింది. తర్జన భర్జనల అనంతరం ప్రభుత్వం ఎట్టకేలకు లోకేష్ పాదయాత్రకు, కుప్పంలో బహిరంగ సభకు అనుమతులు మంజూరు చేసింది.
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో వారం రోజులపాటు లోకేష్ పాదయాత్ర సాగనుంది. అంతకుముందు నారా లోకేష్ పాదయాత్రకు బయల్దేరిన సందర్భంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, అత్తమామల ఆశీస్సులు, కుటుంబంలోని పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.
తడబడితే ట్రోలింగ్‌కు వైసీపీ సిద్ధం..
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పడానికి భారీ జనసమీకరణ చేపట్టేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. కుప్పం మండలం కమతమూరు ప్రాంతంలో లోకేష్ బహిరంగ సభ నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీడీపీ. మరోవైపు లోకేష్ ప్రసంగంలో, పాదయాత్రలోనూ పదనిసలపై వైసీపీ ఎదురు చూస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ద్వారా లోకేష్‌పై సెటైర్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
also read :
India vs New Zealand : టీ20 పోరు నేటి నుంచే.. పృథ్వీ షాకు తుది జట్టులో స్థానం లభించేనా?
శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ సాక్షిగా సిద్ధార్థ్-అదితి లవ్‌పై క్లారిటీ వచ్చినట్టేనా?