fridge లేకపోయినా కూరగాయలను తాజాగా ఉంచు కోవటం మన చేతుల్లోనే ఉంది. ఇలా చేసి చూడండి !
- కరివేపాకు తడి ఆరిపోయే వరకూ ఆరబెట్టి ఒక స్టీలు డబ్బాలో వేసి మూత గట్టిగా బిగించాలి.
- ఆకు కూరలను ఉప్పు నీళ్ళలో వేర్లు మాత్రం తడిసేట్లు వేసి ఉంచితే తాజాదనం కోల్పోవు. ప్లాస్టిక్ సంచుల్లో తడి ఆరాక ఉంచినా పాడవవు.
- పచ్చిమిరపకాయలు తొడిమలు తీసేసి గాలి చొరబడని సీసాలో వేసి చిటికెడంత పసుపు జల్లి కాస్తంత చల్లటి చోటులో ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
- టమోటాలను రాత్రి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచితే ఉదయానికి తాజాగా ఉంటాయి. బుట్టలో పెట్టి తడిగుడ్డ కప్పినా బాగుంటాయి.
- నిమ్మకాయలను చల్లని నీళ్ళలో ఉంచితే నిలువ ఉంటాయి. కానీ ప్రతిరోజూ నీళ్ళను మార్చాలి.
- కాకరకాయను రెండుగా తరిగి పెట్టుకుంటే నిలువ ఉంటాయి.
- క్యారెట్ మొదళ్ళను కోసి ఉంచితే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. వెలుతురు తగలని ప్రదేశంలో వీటిని ఉంచాలి.
- కోడిగుడ్డును వేప ఆకుల మధ్య నిలువ చేయాలి. అవి దొరకని పక్షంలో నెయ్యిగానీ, నూనెగానీ, ఆముదంగానీ రాసి సన్నటి భాగం క్రిందకు, వెడల్పు భాగంపైకి ఉంచితే చాలాకాలం నిలువ ఉంటాయి.
- దోసకాయలను నేలపై ఉంచి ఎండిపోకుండా బేసిన్ మూత పెట్టాలి.
- అరటి, యాపిల్ పండ్లు నిమ్మరసం రాసి ఉంచితే నలుపెక్కకుండా నిలువ ఉంటాయి.
- ఉల్లిపాయలను గాలి తగిలే బుట్టలలో నిలువ ఉంచాలి.
- అల్లాన్ని తడిగుడ్డలో చుట్టి నీళ్ళ కుండీ మీద ఉంచితే వారం రోజులదాకా నిలువ ఉంటుంది.
- బిస్కెట్లు బియ్యం డబ్బాలో ఉంచితే ఎప్పుడూ కరకరలాడుతూనే ఉంటాయి.
మరిన్ని కూల్ కూల్ చిట్కాలు చదవండి :
మీ చీరలు కొత్త చీరల్లా మెరిసిపోవాలంటే..ఇలా చేసి చూడండి..
Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..