Viral Video: ఈ రోజుల్లో పిల్లకాయలు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. చిన్న వయస్సులోనే చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు. అసాధ్యం అనుకున్న దానిని కూడా సుసాధ్యం చేసి చూపుతున్నారు. ఒక్కోసారి పిల్లలని చూసి పెద్దవాళ్లు సైతం ముక్కున వేలేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే జీవితంలో గెలుపు ఓటములు అనేవి సహజం. దేనిని అయిన పాజిటివ్‌గానే స్వీకరించాలి. కొన్ని సార్లు రిజల్ట్ విషయంలో చాలా మంది సహనం కోల్పోతుంటారు. తాజాగా ఐపీఎస్ అధికారి అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో జీవితం గురించి ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఇది తప్పక చూడాలి.
అసాధ్యం కూడా సాధ్యమే
ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు బౌలింగ్ అల్లే వద్ద తొమ్మిది పిన్‌లతో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. పట్టు వదలని విక్రమార్కుడిలా ఉన్న బుడతడు చివరిలో మూడు పిన్నులు మిగిలి ఉండగా, వాటిని పడేయడం కాస్త అసాధ్యమనే చెప్పాలి. కాని, బాలుడు చాలా ఖచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు . అప్పుడు అతని వ్యూహం కారణంగా కొన్ని సెకన్లలో అన్ని పిన్‌లు కింద పడి అతడిని విజేతగా చేస్తాయి. ఆ సమయంలో పిల్లాడి ఆనందం అంతా ఇంతా కాదు.
नामुमकिन भी मुमकिन है,
बस अपनी काबिलियत पर भरोसा रखो और हर बार अपना बेस्ट दो. pic.twitter.com/ECKDelHCBa— Dipanshu Kabra (@ipskabra) October 19, 2022
“అసాధ్యం కూడా సాధ్యమే. మీ సామర్థ్యాన్ని పరీక్షించుకోండి. ప్రతిసారీ కూడా గెలుపు మీదే అవుతుంది” అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇవ్వబడింది. ఈ వీడియో 15,800 వ్యాస్‌తో మరియు చాలా లైక్స్ పొందింది. ప్రజలు ఈ వీడియోని చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నారు. విజయానికి సహనం ఎలా కీలకం అని కొందరు రాస్తే, ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా సరైన వ్యూహమే ముఖ్యమని మరికొందరు కామెంట్లలో తెలిపారు.
ఇవి కూడా చూడండి :
బరువు తగ్గేందుకు సీతాఫలం ఎంతో మేలు.