Telugu Flash News

Viral Video: తల్లిని మేక‌ప్ తీయోద్దంటూ తెగ ఏడ్చేసిన చిన్నారి..!

Viral Video: ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికి బ‌య‌ట‌కు వెళితే మేక‌ప్ త‌ప్ప‌నిస‌రే అయింది. సినిమా వాళ్లే కాదు, సాధార‌ణ మ‌హిళ‌లు కూడా మేక‌ప్ వేసుకునేందుకు తెగ ఆస‌క్తి చూపుతున్నారు. ఇక ఏదైన వేడుక‌లు జ‌రిగితే హీరోయిన్స్ క‌న్నా అందంగా ముస్తాబు అవుతున్నారు.

అయితే ఈ మేక‌ప్ మాయాజాలం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంద‌విహీనంగా ఉన్న వారిని కూడా అందంగా చూపించ‌గ‌ల స‌త్తా మేక‌ప్ కి ఉంది. అయితే కొన్ని సంద‌ర్భాల‌లో మేక‌ప్ వేసుకున్నాక చూసిన వారిని మేక‌ప్ తీసాక చూస్తే అస్స‌లు గుర్తు ప‌ట్టలేం. అయోమయానికి గుర‌వుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

వ‌ద్దు అమ్మా.. ప్లీజ్

చిన్నారి త‌ల్లి మేక‌ప్ తీస్తుండ‌గా, చిన్నారి మాత్రం కనురెప్పల ద్వారా తనను తాను గాయపరుచుకుంటుందని భావించి వద్దు మమ్మీ అంటూ బోరున ఏడ్చేస్తున్నాడు.. హృదయాన్ని కదిలించే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఈ వీడియోను నేహా నితిన్ నాగ్‌పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్,చేయ‌గా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. వైరల్‌ క్లిప్‌లో నేహా ఒక ఈవెంట్ నుండి ఇంటికి వచ్చి చిన్నారి ముందు కూర్చొని మేక‌ప్ తీస్తూ ఉంటుంది.

న‌కిలీ క‌నురెప్ప‌లు తీస్తుండ‌గా, చిన్నారి మాత్రం త‌ల్లికి ఏమైంద‌నో భావించి ఏడుస్తుంటాడు. వ‌ద్దు మమ్మీ..వద్దు వద్దు అంటూ..కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అప్పుడు త‌ల్లి చిన్నారి ప్రేమ‌ని చూసి గుండెలకు హత్తుకుంటుంది. కొడుకు తనను అంత‌గా ప్రేమిస్తున్నందుకు వాడికి ముద్దులు పెడుతోంది.

ఇది ఇంటర్నెట్‌లో మధురమైన ఇన్సిడెంట్‌గా వైరల్‌ అవుతుండ‌గా, నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గ‌తంలోను హ‌ల్‌చ‌ల్ చేశాయి.

Exit mobile version