Liger Movie Review Telugu : మాస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం లైగర్. హిందీ నిర్మాతలు కరణ్ జోహార్ మరియు అజయ్ మెహతాలాతో కలిసి చార్మి లైగర్‌ని నిర్మించారు. కరణ్ జోహార్ నిర్మాణంలో చేరడంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది..మైక్ టైసన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. అనన్య పాండే కథానాయికగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కథలోకి వెళ్తే ..
Liger కథ…
కరీంనగర్ కు చెందిన ఓ బాలుడు.. అతని తల్లి చాయ్ బండిలో చాయ్ అమ్ముకుంటుంది. ఆ వ్యక్తి MMA ఫైటింగ్‌లోకి ఎలా వచ్చాడు? మన దేశానికి త్రివర్ణ పతాకాన్ని ఎలా ఎగురవేశాడు? ఇదీ సినిమా కథాంశం.. తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణ లైగర్ తండ్రి గురించిన రహస్యాన్ని బయటపెట్టడంతో కథలో ట్విస్ట్ మొదలవుతుంది. మరి మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న సంబంధం ఏంటి? విజయ్ తన కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది.
Liger నటీనటుల విభాగం..
విజయ్ లైగర్ గా అద్భుతంగా నటించాడు. తన మేకోవర్‌ని మనం అభినందించాల్సిందే, అనన్య పాండేకి నటించడానికి స్కోప్ లేదు, బాలామణిగా రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది . మైక్ టైసన్ కి ఎక్కువగా స్కోప్ లేదు . రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తమ పాత్రలను చక్కగా చేశారు.
Liger ఎలా ఉందంటే :
దర్శకుడు రొటీన్ స్టోరీ తో కథను అందించడంతో సినిమా పేలవంగా మారింది .మణిశర్మ సంగీతం బాగుంది . సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మిగిలిన టెక్నీషియన్ విభాగాలు బాగా కుదిరాయి మరియు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే ఊహించినంతగా లేదు . సినిమా చూసిన వారంతా నిరాశతో థియేటర్ నుంచి వెళ్లిపోయారు. ఇంతకాలం షూటింగ్ జరిగిన పూరి కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరగా విజయ్ దేవరకొండ ఫాన్స్ మాత్రం ఈ సినిమా అంతగా నచ్చలేదనే చెప్పాలి.
rating: 2.25/5
ఇవి కూడా చదవండి
కియారాతో ప్రేమ నిజమే..కాఫీ విత్ కరణ్ షో లో సిద్ధార్థ్
what if liger flops ? Vijay Deverakonda answer won everyone’s hearts