Back Pain: నడునొప్పి సాధారణంగా చాలా మందిలో వస్తుంటుంది. ఎక్కువగా కూర్చొని పని చేసే వారిలో చూస్తుంటాం. ఈ బాధ వర్ణించలేని విధంగా ఉంటుంది. కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
2017తో పోలిస్తే 2020లో నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. లాన్సెట్ రుమటాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 2050 నాటికి వెన్ను నొప్పితో బాధపడే వారి సంఖ్య 80 కోట్లకు చేరుతుందని తేలింది.
అంటే 2020తో పోలిస్తే 2050 నాటికి 36% పెరుగుతుందని అంచనా కట్టారు. 2020లో 60 కోట్ల మంది ఇలా నడుము నొప్పి బారిన పడినట్టు అధ్యయనం స్పష్టం చేస్తోంది.
వెన్ను నొప్పి, లేదా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య ఆసియా ఖండంలోనే ఎక్కువగా ఉందని, తర్వాత ఆఫ్రికాలో అధిక శాతం నమోదు అవుతున్నాయని సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచంలో ఎన్నో అనారోగ్యాలకు నడుమునొప్పి ప్రధాన కారణంగా నిలుస్తోందట. ఈ నడుము నొప్పి వల్ల మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక అనారోగ్యాలు వంటివి వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also : Elections: సార్వత్రిక ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ సిబ్బంది నియామకంపై మార్గదర్శకాలు