HomehealthLemon juice: నిమ్మ‌ర‌సం తాగితే చాలా మంచిది.. అది ఎన్నిర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా?

Lemon juice: నిమ్మ‌ర‌సం తాగితే చాలా మంచిది.. అది ఎన్నిర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా?

Telugu Flash News

Lemon juice: మ‌న‌కు అందుబాటులో ఉండే వాటిలో నిమ్మ‌కాయ ఒక‌టి. కొంద‌రు దానిని ఇంటి ఆవ‌ర‌ణ‌లో కూడా పెంచుకుంటారు.ఇక నిమ్మ‌కాయ‌ను ప‌లు ర‌కాలుగా వాడుతూ ఉంటారు. కొంద‌రు నాన్ వెజ్ తిన్న‌ప్పుడు వాడుతుంటారు. మ‌రి కొంద‌రు వేడి చేసిన‌ప్పుడు షుగ‌ర్ నీళ్ల‌లా తాగుతుంటారు.

అయితే నిమ్మ‌కాయ‌ని వేడి నీళ్ల‌లో క‌లుపుకొని తాగ‌డం చాలా మంచిది. క‌రోని వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అందరు రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో ప్రజలు నిమ్మకాయ వినియోగాన్ని
ఎక్కువ చేశారు.

నిమ్మ‌ర‌సంతో బ‌హు ప్ర‌యోజ‌నాలు..

నిమ్మ‌కాయ‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కావున ఇది మ‌న శ‌రీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు కూడా నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటారు.

ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి శరీరంలో వేడిని చాలా తగ్గిస్తుంది. నిమ్మ నీరు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రంగా చురుకుగా పనిచేయడంలో నిమ్మరసం గొప్ప‌గా సాయ ప‌డుతూ ఉంటుంది. అయితే నిమ్మ‌ర‌సం ఎక్కువ‌గా తీసుకున్న కూడా న‌ష్టాలు ఉన్నాయి.

మీరు నిమ్మకాయ నీటిని అవసరానికి మించి తీసుకుంటే అందులోని పుల్లని ఆహారాలు వల్ల గొంతు నొప్పి, టాన్సిల్స్ సమస్య వస్తుంది. అంతేకాక నిమ్మ‌కాయలో ఉండే ఆమ్ల గుణాల వ‌ల‌న దంతాల‌ను దెబ్బ తీస్తుంది.

నిమ్మరసం తరచుగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ మీరు నిమ్మరసం ఎక్కువగా తాగితే అది లేని పోని స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి వ్యాధులు క‌ల‌గ‌డ‌మే కాక‌, మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తీవ్రమైన పరిస్థితుల్లో వాంతులు కూడా అవుతాయి. కాబ‌ట్టి ఏదైన ఒక మోతాదులో తీసుకోవ‌డం మంచిది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News