HomecinemaPawan Kalyan : ప‌వ‌న్, సుజీత్ సినిమా గ్రాండ్‌గా స్టార్ట్.. షాకింగ్ లీక్.. దానికి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!

Pawan Kalyan : ప‌వ‌న్, సుజీత్ సినిమా గ్రాండ్‌గా స్టార్ట్.. షాకింగ్ లీక్.. దానికి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!

Telugu Flash News

Pawan Kalyan : ప్ర‌స్తుతం ఇటు సినిమాలు, అటు రాజ‌కీయాల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల‌తో చాలా బిజీగా ఉంటూనే మ‌రోవైపు సినిమాల‌పై దృష్టి పెడుతున్నారు ప‌వ‌న్.

ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న ప‌వ‌న్ త‌ర్వాత‌.. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయ‌నున్నాడు. ఆ మ‌ధ్య ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకట‌న చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ పోస్టర్ డిజైన్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది.

పోస్ట‌ర్‌లో పవన్ కళ్యాణ్ బ్యాక్ స్టిల్ లో నిల్చుని ఉండగా ఆయన షాడో గన్ లాగా పడింది. ఈ సినిమాని సుజీత్ కళ్ళు చెదిరే యాక్షన్ ఎలిమింట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తాడు అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

ఈరోజు ఈ మూవీ ప్రాజెక్ట్ ‘ఓజీ’ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది.

-Advertisement-

తాజాగా ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ తో పాటు చాలా మంది నిర్మాతలు ఉన్నారు.

దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమానికి థమన్ కూడా వచ్చాడు. ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా థమన్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ ఫేమ్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం గురించి ఒక షాకింగ్ లీక్ బయటకు వచ్చింది.. ఈ చిత్రంలో సాంగ్స్, ఫైట్స్ ఉండవు అంటూ ప్రచారం మొదలైంది. ఆ రకంగా స్క్రిప్ట్ ఉంటుంది అంటూ లీకులు వస్తున్నాయి.

 

ఇటీవ‌ల హీరోయిన్స్ లేకుండానే ప‌లు సినిమాలు లాగించేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే చేస్తున్నారా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

మరిన్ని చదవండి :

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

Dry Fruits Health Benefits : పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News