మంచి టాలెంట్ ఉన్న తారకరత్న చిన్న వయస్సులోనే గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుతో కుప్పకూలిపోయారు.పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో ఆయన చనిపోయారని కొందరు చెబుతున్నారు.
తారకరత్న మృతిపై తాజాగా మాట్లాడిన లక్ష్మీ పార్వతి ..మరోసారి నీచమైన రాజకీయం తమ కుటుంబంలో బయటపడిందని చెప్పారు. తారకరత్న ప్రాణాలు ఎప్పుడో పోయాయని, అయినా ఇంత కాలం ఆ అబ్బాయిని అలా వుంచడం ఏం రాజకీయం అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించింది. చనిపోతే పాదయాత్రను వాయిదా వేసుకుంటే ఏమయ్యేది. పాదయాత్రలో చనిపోతే, ప్రజలు అపశకునంగా భావిస్తారనే స్వార్థంతో ఇదంతా చంద్రబాబు నడిపిన డ్రామా అని లక్ష్మీ పార్వతి స్పష్టం చేసింది. తండ్రీతనయులు అందరికి అపశకునం అని అందరికీ తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది లక్ష్మీ పార్వతి.
Let's spread this video Cults🙏
It's a complete 💯 diversion of Taraka Ratna garu death🙏#ABNBrokerKrishna pic.twitter.com/gMHIopRLsW— PsPk Cult Harsha 🌟 (@Harshavamshi143) February 19, 2023
also read :
గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..