HomesportsLaxman : ద్ర‌విడ్ ఔట్.. ల‌క్ష్మ‌ణ్ ఇన్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్

Laxman : ద్ర‌విడ్ ఔట్.. ల‌క్ష్మ‌ణ్ ఇన్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్

Telugu Flash News

Laxman :  దాదాపు 12 ఏళ్ల నుంచి టీమ్‌ఇండియాకు ఐసీసీ ట్రోఫీని గెలవడం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోయింది. ధోనీ నాయకత్వంలో 2011లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ను సాధించ‌గా, అప్పుడు ప్రధాన కోచ్‌గా కిరిస్టెన్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత కోచ్‌లు, కెప్టెన్లు మారినా మాత్రం క‌ప్‌ దక్కలేదు. అయితే ప్రస్తుతం కోచ్​ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ ద్రవిడ్​ అయిన భార‌త్‌కి టీ 20 క‌ప్ అందిస్తాడా అంటే అది జ‌ర‌గలేదు. ఇక ఈ ఏడాది వ‌న్డే ప్రపంచ క‌ప్ జ‌ర‌గ‌నుండ‌గా, ఆ టోర్నీలో అయిన టీమిండియా క‌ప్ కొడుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ద్ర‌విడ్ ప్లేస్​లో మరో కోచ్​ పేరు వినిపిస్తోంది. అతడే మన ‘వెరీ వెరీ స్పెషల్’ లక్ష్మణ్! భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనుంది.

2022లో చేదు అనుభవాల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మను కూడా తప్పించనున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగుస్తుంది. ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించకూడదని బీసీసీఐ భావిస్తే, ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కొన్ని జాతీయ వార్తా కథనాల్లో వ‌చ్చాయి. జనవరి 1న బీసీసీఐ సమీక్షా సమావేశాన్ని నిర్వహించ‌గా, ఈ సమావేశానికి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మను పిలవలేదు. 2023 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్‌కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో చర్చించి ఉంటార‌ని, మార్పులు, వ్యూహాలను రూపొందించార‌ని టాక్.

ఆసియా కప్ 2022 సమయంలో రాహుల్ ద్రవిడ్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వీవీఎస్ లక్ష్మణ్.. కోచ్ బాధ్యతలు నిర్వహించారు . జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్థాయిలో కోచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు-మ్యాచ్‌ల T20 సిరీస్‌లో వీవీఎస్ లక్ష్మణ్ తొలిసారిగా టీమ్ ఇండియాకు కోచ్‌గా వ్యవహరించారు. ల‌క్ష్మ‌ణ్ ప్రస్తుతం బెంగళూరులో ‘నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌’గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ల‌క్ష్మ‌ణ్ టెస్ట్‌ల వ‌ర‌కు కోచ్‌గా ఒకే కాని వ‌న్డేల‌కు, టీ20ల‌కు మాత్రం వేరే కోచ్‌ని నియ‌మిస్తే బాగుంటుంద‌ని ప‌లువురు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News