కర్ణాటకలో సరికొత్త కేసు వెలుగు చూసింది. లాయర్ (Lawyer) వృత్తిలో కొనసాగుతున్న ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పని కోసం వచ్చిన ఓ యువకుడిపై లాయర్ ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా నిలుస్తోంది. యువకుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, నిందితుడు లాయర్ కావడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. అయితే, కోర్టులో పర్మిషన్ తీసుకొని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోలీసులు ఈ కేసును సాల్వ్ చేశారు.
మొదట ఈ కేసులో ఎంత ప్రయత్నించినా పరిష్కారం లభించక పోలీసులు తలలు పట్టుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కోర్టు అనుమతి తీసుకొని నిందితులకు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒళ్లు గగుర్పొడిచే అంశాలు తెలిశాయి.
గతేడాది మే 19న కర్ణాటకలోని కనకపుర ప్రాంతానికి చెందిన ఆశా కుమారుడు శ్రేయస్ కనిపించకుండా పోయాడు. లాయర్ ఆఫీసులో పని చేసేందుకు వెళ్తున్నానని చెప్పిన శ్రేయస్.. తర్వాత మాయం అయ్యాడు దీంతో ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా నిందితులు లాయర్ శంకర్ గౌడ్, అసిస్టెంట్ అరుణ్‌లను అరెస్టు చేశారు.
అసహజ పద్ధతిలో లైంగిక చర్య..
నిందితులను ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పకపోవడంతో లాభం లేదనుకొని పోలీసులు కోర్టుకెళ్లి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. కొత్త టెక్నాలజీ ద్వారా యువకుడి అదృశ్యానికి సంబంధించిన వివరాలు రాబట్టారు. నిందితుడు లాయర్ శంకర్ గౌడ్ తలకు సెన్సార్లు అమర్చి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కొన్ని చిత్రాలు, వీడియోలు చూపించడంతో బ్రెయిన్‌లో కదలికలు వచ్చి అతడి ఆలోచనలు బయటకు వచ్చాయి. అనంతరం శ్రేయస్‌ను తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అంతకుముందు శ్రేయస్‌కు మత్తు మందు ఇచ్చి అసహజ పద్ధతిలో లైంగిక చర్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులపై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
also read news:
Viral Video Today : రోడ్డుపై బుల్లెట్ బండితో ఫీట్లు.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్ వీడియో
Tollywood News : చిరంజీవి, బాలకృష్ణల భార్యలలో ఈ కామన్ పాయింట్ గుర్తించారా..!
Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?