Lavanya Varun: సోషల్ మీడియాలో ఈ మధ్య సెలబ్రిటీలకి సంబంధించి ప్రచారాలు ఎక్కువయ్యాయి. ఈ ప్రచారాలలో ఎంత నిజం ఉందనేది తెలియక అభిమానులు కన్ఫ్యూజన్‌కి గురవుతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మిస్టర్, అంతరిక్షం సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారిందట.
ఆ మధ్య లావణ్య పుట్టినరోజును అక్కడ సెలబ్రేట్ చేసేందుకే వరుణ్ తేజ్ బెంగళూరు వెళ్లాడని ఎన్నో పుకార్లు షికారు చేశాయి. అక్కడే ఆమెకు ప్రపోజ్ చేశాడంటూ కూడా కొందరు చెప్పుకొచ్చారు. ఈ వార్తలపై మెగా కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఆ సమయంలో లావణ్య త్రిపాటి మాత్రం స్పందిస్తూ.. తాను బెంగళూరులో లేనని, తన సొంతూరు డెహ్రాడూన్ లో కుటుంబ సభ్యులతో కలిసివున్నానంటూ ఫోటోలు షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది.
లావణ్య ఇచ్చిన క్లారిటీతో పుకార్లకి కాస్త బ్రేక్ పడినట్టు అయింది. కాని ఇప్పుడు మళ్లీ ఆ వార్త చర్చనీయాంశం అవుతుంది. వీరిద్దరి వివాహానికి మెగా కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు బలమైన ప్రచారం నడుస్తుంది.. అయితే ఎవరూ ఈ న్యూస్ గురించి అధికారికంగా ప్రకటించలేదు.
అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే లావణ్య త్రిపాఠి తాజాగా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్లు రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఆమె పేరుని ఇప్పుడు లావణ్య వరుణ్ అని మార్చేస్తూ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే లావణ్య, వరుణ్ రియల్ లైఫ్ జోడిగా ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ కూడా అయిపోయారు. మరి రానున్న రోజులలో ఇది నిజం అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని, అమ్మాయి ఎవరనేది తనే చెబుతాడని అన్నారు. ఇక అప్పటి నుంచి వరుణ్ తేజ్ మీడియాకు ఎవరిని పరిచయం చేస్తాడో చూడాలనే ఆసక్తి సినీ పరిశ్రమతోపాటు అభిమానుల్లో కూడా చాలా ఉంది. లావణ్య తో వరుణ్ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయిందంటూ పింక్ విల్లా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఇప్పుడు వారి ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
also read :
Varun Tej:వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ త్వరలోనే.. ఈ వార్త ఎలా వచ్చిందంటే..!
Varun Tej: మరోసారి వార్తలలోకి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి!