HomecinemaLasya: గుడ్ న్యూస్ చెప్పిన లాస్య‌.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న నెటిజ‌న్స్

Lasya: గుడ్ న్యూస్ చెప్పిన లాస్య‌.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న నెటిజ‌న్స్

Telugu Flash News

Lasya: బుల్లితెర ప్రేక్షకుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు లాస్య‌. అంద‌రిది ఒక రూట్. త‌న‌ది ఒక రూట్ అన్న‌ట్టుగా యాంక‌రింగ్ చేసి అల‌రించింది లాస్య‌. ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపుల‌ర్ అయింది.

ఇక పెళ్లి త‌ర్వాత యాంక‌రింగ్‌కి దూర‌మైన లాస్య‌.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని త‌నదైన ఆట, మాట‌ తీరుతో అట్రాక్ట్ చేసింది. ఇక ఆ త‌ర్వాత ఆమె.. వీలు కుదిరినప్పుడల్లా స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమంటోంది.

ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ ‘పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు’ షోకి తన భర్తతో సహా విచ్చేసిన లాస్య వేదికపై కన్నీరు కూడా పెట్టుకుంది.

మ‌రోసారి త‌ల్లి కాబోతుంది..

కొన్నాళ్ల క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని ఆమె పేరెంట్స్ ఒప్పుకోక‌పోవ‌డంతో చాలా రోజులుగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. అయితే లాస్య తల్లి అయ్యాక తల్లిదండ్రులు దగ్గరకు తీశారు.

లాస్యను మొదటి సంతానంగా కొడుకు పుట్టగా , ఆ బుడ‌త‌డిని జున్ను అని ప్రేమ‌గా పిలుచుకుంటారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు కూడా లాస్య జున్ను గురించి చెబుతూ తెగ సంద‌డి చేసేది. ఇక దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత లాస్య మళ్ళీ గర్భం దాల్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియ‌జేస్తూ షాకిచ్చింది.

లాస్య ఆమె భ‌ర్త ఇద్ద‌రు టెస్ట్ చేసుకున్న దానితో ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో లాస్య తల్లి అయింద‌ని తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lasya Chillale (@lasyamanjunath)

-Advertisement-

ఇక ఇటీవల లాస్య అనారోగ్యం బారిన పడ్డారు. ఆసుపత్రిలో పేషేంట్ గా బెడ్ పై ఉన్న లాస్య ఫోటోను మంజునాథ్ షేర్ చేయడంతో ఆమెకు ఏమైందో అని అందరు టెన్ష‌న్ ప‌డ్డారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.

హెవీ ఫీవర్ తో ఆసుపత్రిలో చేరిన లాస్య తిరిగి కోలుకున్నారు. తాజాగా గుడ్ న్యూస్ చెప్పి అందరిని ఆనంద‌ప‌రిచింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News