Telugu Flash News

L.R.Eswari : ఊ అంటావా అనేది ఓ పాటేనా.. ప్ర‌ముఖ సింగ‌ర్ ఫైర్

LR Eswari's Shocking Comments On Samantha Ruth Prabhu's 'Oo Antava' Song

L.R.Eswari Shocking Comments On Samantha Ruth Prabhu’s ‘Oo Antava mama’ Song : అల్లు అర్జున్, ర‌ష్మిక మందన్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో స‌మంత చిందులు వేసిన ఊ అంటావా పాట‌కు ఎంత రెస్పాన్స్ వ‌చ్చింద‌నేది మ‌నంద‌రికి తెలిసిందే.

అయితే ఈ పాట‌పై ప్ర‌ముఖ సింగ‌ర్ ఎల్.ఆర్. ఈశ్వరి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ‘మాయాదారి చిన్నోడు మనస్సే లాగేసిండు, లేలే నా రాజా, మసక మసక చీకటిలో, మల్లె తోట ఎనకాలా, భలే భలే మగాడివో బంగారు నా సామివోయ్’ ఇలా ఎన్నో పాట‌ల‌కు తన హస్కీ వాయిస్‌తో పాట‌లు పాడి మెస్మరైజ్ చేసింది.

మత్తు ఎక్కించే పాటలే రావడం వెనుక ఆమె స్పందిస్తూ.. తాను హుషారుగా పాడతానని, దర్శకుడు తనకు ఆ పాటలే ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఛానల్స్‌లో ఇంతకాలంగా ఎన్నో పాటల కార్యక్రమాలు వస్తున్నాయి కానీ ఎందులోనూ తన పాటలు ఎవరూ పాడరని అందుకు కారణం ఏంటో తెలియ‌ద‌ని ఎప్పింది.. ఆ సమయంలో యాంకర్ ఆమెతో ఊ అంటావా మామా సాంగ్ పాడించ‌డంతో పాటు దానిపై అభిప్రాయం అడిగింది.

ఇది ఒక పాటనా? పై నుంచి క్రింది వరకూ ఒకేలా ఉంది. ఆరు లైన్లు ఒకేలా ఉన్నాయని ఆమె ఫైర్ అయింది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు.. తాను సంగీతాన్ని పెళ్లి చేసుకున్నానంటూ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

Also Read :

Eiffel Tower : ఈఫిల్‌ టవర్‌ చరిత్ర , విశేషాలు తెలుసుకోండి

Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

 

Exit mobile version