HomecinemaKushi: ఖుషీ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో అదిరిపోయింది.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Kushi: ఖుషీ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో అదిరిపోయింది.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Telugu Flash News

Kushi: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వ‌స్తున్న తాజా చిత్రం ఖుషీ. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మొద‌టి నుండి మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక మేకర్స్ నిన్ననే సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా ఇప్పుడు ఈ ప్రోమోను అయితే రిలీజ్ చేశారు. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పాలి.

అలాగే హీషమ్ అబ్దుల్ ఇచ్చిన సోల్ ఫుల్ మ్యూజిక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇక విజయ్ మరియు సమంత లు అయితే మరింత బ్యూటిఫుల్ కనిపిస్తుండగా వారి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ లవ్ ఉండేలా అనిపిస్తుందని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. . మొత్తానికి అయితే ఈ ఫస్ట్ సాంగ్ ప్రోమో చూడ ముచ్చటగా , ప్రామిసింగ్ గా ఉందనే చెప్పాలి.. మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సాంగ్ అయితే ఈ మే 9న రానుండగా మైత్రి మూవీ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News