HomecinemaKushi: ప‌వ‌న్ ఖుషీ స్టోరీ మొత్తాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ కాపీ కొట్టేశాడా..!

Kushi: ప‌వ‌న్ ఖుషీ స్టోరీ మొత్తాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ కాపీ కొట్టేశాడా..!

Telugu Flash News

Kushi: టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ఖుషీ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, ఆయన కెరీర్ లో క్లాసికల్ సినిమాగా మిగిలిపోయింది.

మ‌రి అదే టైటిల్‌తో సినిమా చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఏం చేస్తాడా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయితే మాత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఏకి పారేయ‌డం గ్యారెంటీ.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమా టైటిల్ ని మాత్రమే కాదు, స్టోరీ లైన్ కూడా పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం నుండే తీసుకున్నారనే ప్ర‌చారం న‌డుస్తుంది. ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరి ప్రేమికుల మధ్య ఈగో ఏర్ప‌డ‌డం త‌ర్వాత క‌ల‌వ‌డం ఆధారంగా సినిమాని రూపొందిస్తున్నార‌ని అంటున్నారు.

మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగాఖుషీ సినిమా ఘనంగా విడుదల అవ్వబోతుందని ఇది వరకే మూవీ మేకర్స్ ప్రకటించారు. స‌మంత అనారోగ్యం వ‌ల‌న మూవీ షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డిన విష‌యం విదిత‌మే.

also read :

Success Story : ఇంటర్‌ ఫెయిల్‌ నుంచి ఐపీఎస్‌ దాకా.. మనోజ్‌ శర్మ విజయగాధ!

-Advertisement-

WTC Final : తుది జట్టులో చోటు దక్కేదెవరికి? రహానె భీకర ఫాం కొనసాగిస్తాడా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News