Telugu Flash News

Chiranjeevi: చిరంజీవితో రొమాన్స్ చేయాల‌ని ఉంద‌న్న కోరిక‌ని బ‌య‌ట‌పెట్టిన ఖుష్బూ

Chiranjeevi: తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులకి బాగా సుప‌రిచితం ఖుష్బూ. ఈవిడ ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల‌లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ లో న‌టిస్తూ అల‌రిస్తుంది. తమిళ ప్రజలు అయితే ఆమె అందం, అభినయానికి ఫిదా అయిపోయి ఏకంగా గుడి కూడా కట్టించారు. ఖుష్బూ నటించిన తాజా చిత్రం ‘రామబాణం’ విడుదలకు సిద్ధంగా ఉండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఖుష్బూ… మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్‌ చిరంజీవితో రొమాన్స్‌ చేయాలన్న తన కోర్కెను బయటపెట్టింది.

చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయ‌న నుండి చాలా నేర్చుకోవ‌చ్చు. మంచి మానవత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం, చేసే పని మీద ప్యాషన్ అతనికి అద్భుతంగా ఉంటాయి. ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే, కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ‘నేను మెగాస్టార్‌ ఏది చేసినా చూస్తారు’ అని అనుకోరు. నా జీవితంలో పూర్తి కానిది ఏదైన ఉంది అంటే అది చిరంజీవి గారితో రొమాన్స్‌ చేయలేకపోవటమే.. మెచ్యూర్‌ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో క‌లిసి చేయాలని ఉంది. అదే నా కల అంటూ ఖుష్బూ మ‌న‌సులోని మాట‌ల‌ని బ‌య‌ట‌పెట్టింది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

Exit mobile version