Telugu Flash News

కేటీఆర్‌ వెయ్యి ఎకరాల భూ కుంభకోణం.. రేవంత్‌ సంచలన ఆరోపణలు!

revanth reddy

revanth reddy

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. నేతలు ప్రజల్లో తిరుగుతూ బిజీ అయ్యారు. అధికార పక్షం కూడా దూకుడు పెంచింది. ఎప్పుడు ముందస్తుకు వెళ్లినా తాము సిద్ధమని ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకోవడంలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రస్తుతం హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌యాత్రలో బిజీగా ఉన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం నుంచి రేవంత్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాటల దాడిని పెంచారు రేవంత్‌.

తాజాగా రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. బీఆర్ఎస్‌ నేతలు రేవంత్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. పాతయాత్రలో భాగంగా తాజాగా మరోసారి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం భూ లావాదేవీలను సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ధరణి పోర్టల్‌లో సమస్యలపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేశాయి. తాజాగా దీనిపై రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

జీవో 111 ప్రకారం మంత్రి కేటీఆర్‌ వెయ్యి ఎకరాల భూ కుంభకోణం చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అటు కేసీఆర్‌పైనా, ఇటు కేటీఆర్‌పై కూడా విమర్శలతో రెచ్చిపోతున్నారు. పాదయాత్రలో భాగంగా మాట్లాడిన రేవంత్‌.. తోట చంద్రశేఖర్‌కు కేటాయించిన భూములపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీతిమంతుడైతే విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

రాష్ట్రంలో రుణ మాఫీ ఎందుకు అమలు చేయడం లేదని సీఎంను రేవంత్‌ ప్రశ్నించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఎందుకు అమలు కావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.850 కోట్ల బకాయి ఉందని రేవంత్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా రైతులకు అనుకూలమైన విధానాలను తెచ్చిందన్న రేవంత్‌.. కేసీఆర్‌ కేవలం ఆడంబరంగా ఉచిత విద్యుత్‌ అంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఇవ్వడం లేదన్నారు. ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల నుంచి కేసీఆర్‌ 50 శాతం కమీషన్లు తీసకున్నారని, విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చేశారని రేవంత్‌ మండిపడ్డారు.

also read :

Rashmi Gautham: ఈ సారి ర‌ష్మీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌బోతుందా ?

తన భర్తే అనుకొని ఆమె చేసిన పని చూస్తే.. నవ్వు ఆపుకోలేరు!

Exit mobile version