HomecinemaKTR: ఇళ‌య‌రాజా సార‌థ్యంలో మ్యూజిక్ స్కూల్ ఏర్పాటు.. కేటీఆర్ ప్ర‌క‌ట‌న‌

KTR: ఇళ‌య‌రాజా సార‌థ్యంలో మ్యూజిక్ స్కూల్ ఏర్పాటు.. కేటీఆర్ ప్ర‌క‌ట‌న‌

Telugu Flash News

KTR: తెలంగాణ రాష్ట్రలో మ్యూజిక్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటూ కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. శ్రియా ప్రధాన పాత్రలో నటించిన `మ్యూజిక్‌ స్కూల్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఇదే కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఇళయరాజా సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, మ్యూజికల్‌ యూనివర్సిటీ లాంటి ఇళయరాజా తో కలిసి ఈ వేదికని పంచుకోవడం ఎంతో గౌరవంగా ఉందని తెలిజేశారు.

అలానే తాను ఈ ఈవెంట్‌కి ఓ ఎజెండాతో వచ్చానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మ్యూజిక్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయ‌న అన్నారు.. ఇళయరాజాగారి సారథ్యంలో ఆయన లీడ్‌గా మ్యూజిక్‌ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నట్టు కేటీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. దీనికి ఇళ‌యరాజా సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఇళయరాజాతో పాటు హీరోయిన్‌ శ్రియా, నిర్మాత దిల్‌రాజు, ఇతర చిత్ర బృందం కూడా పాల్గొన్నారు. మ్యూజిక్ స్కూల్ చిత్రం ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.

also read:

Maruthi: డైరెక్ట‌ర్ మారుతి ల‌వ్ స్టోరీ మాములుగా లేదుగా.. తొలిసారి ఓపెన్ అయిన ద‌ర్శ‌కుడు

Varshini: టైట్ టీ ష‌ర్ట్‌తో ఉప్ప‌ల్ లో మెరిసిన వ‌ర్షిణి.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News