Telugu Flash News

kshama bindu : మొదటి కర్వా చౌత్ చేసుకున్న సోలోగామి క్షమా బిందు…

kshama bindu celebrates first karwa chauth

kshama bindu celebrates first karwa chauth

kshama bindu : వివాహిత హిందూ మహిళలు కర్వా చౌత్ జరుపుకుంటారు. భాగస్వాములు రోజంతా ఉపవాసాన్ని పాటిస్తే పురుషులు దీర్ఘకాలం మరియు ఆరోగ్యంగా జీవిస్తారని ఉత్తర భారతదేశంలో నమ్మకం. ఆచారం ప్రకారం, స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత వారి భర్త ముఖాలను చూసిన తర్వాత మాత్రమే ఆహారం మరియు నీరు తీసుకుంటారు. గుజరాత్‌కు చెందిన క్షమా బిందు(ఆమె/అతడు) కూడా తనను తానూ సోలోగామి పద్దతిలో పెళ్లిచేసుకున్నాక వచ్చిన మొట్టమొదటి కర్వా చౌత్ ను జరుపుకున్నారు.

క్షమా బిందు (kshama bindu) యొక్క కర్వా చౌత్ వేడుకలు మరియు ఆమె వివాహం రెండూ అసాధారణమైనవి. తాను చేసిన పూజా కార్యక్రమాలను తనతో పంచుకుని ఆ తర్వాత అద్దంలో తనను తాను చూసుకుంటూ తన ఉపవాసాన్ని విరమించుకున్నారు అంతేకాకుండా తనకు తానూ స్వంతంగా హారతి ఇచ్చుకున్నారు.

ఆమె ఎరుపు చీర, బంగారు జాకెట్టు మరియు నగలతో అలంకరించుకుని ఈ పండగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ ఫోటోలలో క్షమా ఉల్లాసంగా కనిపిస్తూ చిరునవ్వులతో పోజులిచ్చారు.

తన పోస్ట్‌కి క్యాప్షన్, “ఈ రోజు మొదటి కర్వా చౌత్‌ని జరుపుకున్నాను, నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు, నా కోల్పోయిన గర్వాన్ని కనుగొన్నాను. కర్వా చౌత్ శుభాకాంక్షలు” అని పెట్టారు.


నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేసారు. ఒకరు ఇలా అన్నారు, “నేను ఆలోచిస్తున్నా అసలు మిమ్మల్ని మీరు అద్దంలో ఎలా చేసుకోగలిగారు అడ్డం మంచి ఎంపికే గాని ఫోటో వాడాల్సింది” అని.

మరొకరు ఇలా వ్రాశారు, “నాకు అనిపిస్తుంది మీరు మీ గురించి ఈ వ్రతం చేసారు దీనినే స్వీయ ప్రేమ అంటారు” అని. ఇంకొకరు “మీ జీవితం అంతా ఇంతే అందంగా ఉండాలి” అని. ఇంకొకరు “అలా ఉండాలి” అని కామెంట్లు చేశారు.

జూన్‌లో క్షమా తన పెళ్లి నిర్ణయాన్ని ప్రకటించిన తరవాత రాజకీయ పార్టీలు మరియు ట్రోలింగ్‌ల నుండి పెద్ద ఎదురుదెబ్బకు గురి అయింది. అయితే, అది ఆమెను ఆపలేదు.

తొలుత జూన్ 11న తనను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె, బీజేపీ ప్రతినిధి పెళ్లికి అభ్యంతరం చెప్పడంతో పాటు హెచ్చరించడంతో ప్లాన్ మార్చుకుంది. పెళ్లి తర్వాత రెండు వారాల హనీమూన్‌కి గోవా కూడా వెళ్లింది.

మీడియాతో మాట్లాడిన క్షమా, తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదనుకుంటున్నాను అని. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.

ఇవి కూడా చూడండి : 

వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..

పిల్లల్లో జ్వరానికి భయపడద్దు.. ఇలా చేయండి..

సాయంత్రం ఆరు దాటాక చేయకూడని పనులు

Exit mobile version