Telugu Flash News

Kriti Sanon: అందుకే హీరోయిన్స్ కి త్వ‌ర‌గా పెళ్లిళ్లు కావు.. కృతి స‌న‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

kriti sanon hot pics

Kriti Sanon: ఇటీవ‌లి కాలంలో చాలా మంది ముద్దుగుమ్మ‌లు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కొంద‌రు పెళ్లి త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కి దూరంగా ఉంటుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం రీఎంట్రీ ఇస్తూ స‌త్తా చాటుతున్నారు.

ఇక కొంద‌రు హీరోయిన్స్ పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్న క్ర‌మంలో పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్ పెళ్లిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు అంటుంది కృతి.

సినీ ఇండస్ట్రీలోకి వెళ్తే అమ్మాయిలు చెడిపోతారు అనే చెడు అభిప్రాయం ఎంతో మందిలో ఉంది. అందుకే ఇండస్ట్రీలోకి పంపడానికి తల్లిదండ్రులు కూడా ఓ అడుగు వెన‌కేస్తుంటారు. ఈ క్రమంలో స్పందించిన కృతి.. హీరోయిన్ గా చేయడం అనేది ఒక ఉద్యోగంగా ఎవరూ ఎందుకు చూడరు అని తెలిపింది కృతి.

సినిమా ఇండస్ట్రీలో నటిగా పని చేయడం ఒక వృత్తిగా చూడరు కాబట్టే, హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే అంత త్వరగా హీరోయిన్స్ కు పెళ్లిళ్లు కావు అని పేర్కొంది కృతి స‌న‌న్.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి వ్యాఖ్యలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

also read:

Naveen Murder Case : సంచలన విషయాలు బయటపెట్టిన నిహారిక.. నవీన్‌ హత్య కేసు ఫుల్ స్టోరీ..

samyuktha menon Latest stills, Images, Photos 2023

heat stroke : వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఎలా?

 

Exit mobile version