Telugu Flash News

Krithi Shetty: కృతి శెట్టి అలా అనేసిందేంటి.. ఇక రెచ్చిపోయిన నెటిజ‌న్స్

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఈ ముద్దుగుమ్మ ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుంది. చిన్న పెద్ద హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది.

అంతేకాదు కెరీర్‌లో మొద‌ట చాలా ప‌ద్ద‌తిగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. కథ డిమాండ్ చేస్తే.. హాట్ హాట్ అందాలు ఆరబోయడానికి, స్పైసీ స్పైసీ సీన్స్ చేయడానికి కూడా నేను రెడీ అంటూ నిర్మాత‌లకు సూచ‌న‌లు పంపుతుంది కృతి శెట్టి.

అలా అనేసింది ఏంటి..

ఇప్పటికే శ్యామ్ సింగ్ రాయ్ లో నానీతో ఘాటు రొమాన్స్ చేసిన ఈ చిన్నది, స్టార్ హీరోల జతగా వరుస ఆఫర్లు కొట్టేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రీసెంట్గా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొరపాటున కృతి టంగ్ స్లిప్ అయ్యి ఓ బూతు పదం వ‌దిలింది. దీంతో పట్టేసుకున్న కోలీవుడ్ జనాలు కృతిని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు .

అయితే అమ్మ‌డు కావాల‌ని ఆ మాట అన‌లేద‌ని, అనుకోకుండా అలా బ‌య‌ట‌కు రావ‌డంతో దానిని ప‌ట్టుకొని తెగ ఆడేసుకుంటున్నారు. ఇప్ప‌టికే స‌క్సెస్ లు లేక ఇబ్బంది ప‌డుతున్న కృతి శెట్టికి ఇప్పుడు ఇలా ట్రోల్స్ జ‌ర‌గ‌డం చూసి బ్యాడ్ టైం న‌డుస్తుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

ఇక వరుస సినిమాల్లో కనిపించిన కృతి శెట్టి ప్రస్తుతం మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.అంతే కాదు తన ఖాతాలో మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. హిందీలో సూపర్ 30 లో స్టూడెంట్ గా మొదటి సారి తేరంగేట్రం చేసింది కృతి శెట్టి.

ఆ సినిమా తరువాత తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఉప్పెన‌, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాల‌తో హిట్ కొట్టింది . ఈ క్రమంలోనే కృతి తన మాటల గారడితో అవకాశాలు దక్కించుకునే పనిలో బిజీగా మారింది అని చెప్పుకొస్తున్నారు జనాలు.

also read :

IND vs ZIM: పాక్ న‌టి బంప‌ర్ ఆఫ‌ర్ .. ఇండియాని జింబాబ్వే ఓడిస్తే అందులో ఒక‌రిని పెళ్లి చేసుకుంటా..!

bigg boss telugu 6 : బిగ్ బాస్ పెద్ద చిచ్చు పెట్టాడుగా.. ఇక ఫైటింగ్ పీక్స్‌లోనే..!

Exit mobile version