HomecinemaKrishnam Raju: ఇది నిజ‌మా.. ప్ర‌భాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు త‌న డైరీలో రాశాడా..!

Krishnam Raju: ఇది నిజ‌మా.. ప్ర‌భాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు త‌న డైరీలో రాశాడా..!

Telugu Flash News

Krishnam Raju: టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప్ర‌తి ఒక్క‌రికి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది.

సోమవారం సాయంత్రం మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో కృష్ణం రాజు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌గా, తమ అభిమాన హీరోను చివరి చూపు చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలివెళ్లారు.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కృష్ణంరాజు మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని న‌ష్టం అని చెబుతున్నారు. కొంద‌రు ఆయ‌న‌కు సంబంధించిన జ్ఞాప‌కాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఆయ‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా చెప్పుకొస్తున్నారు.

డైరీలో అలా రాశాడా..!

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజుకి ప్ర‌భాస్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఆయ‌న‌తో క‌లిసి న‌టించేందుకు కూడా ఆస‌క్తి చూపుతుండే వార‌ట‌. అందుకు ప్ర‌భాస్‌తో చివ‌రిగా రాధే శ్యామ్ చేశాడు. ఇక ప్ర‌భాస్‌కి పెళ్లి అయితే వారి పిల్ల‌ల‌ని ఎత్తుకొని స‌ర‌దాగా గ‌డ‌పాలాని కృష్ణంరాజు ఎన్నో క‌ల‌లు క‌న్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కృష్ణంరాజు తన డైరీలో ప్ర‌భాస్ పెళ్లి గురించి రాసుకున్నారట. ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అనుష్కతో ప్రేమే కారణం అని ఆయ‌న డైరీలో రాసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. అయితే కృష్ణం రాజు సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేశారు.

కృష్ణం రాజుకి డైరీనే రాసే అల‌వాటు లేదు. ఏదైన మొహం మీద చెప్పేస్తారు. ద‌య‌చేసి ఆయ‌న గురించి త‌ప్పుడు ప్ర‌చారాలు మానేయండి అంటూ కొందరు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చార‌ట‌. రీసెంట్‌గా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దివంగ‌త సినీ న‌టుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.

-Advertisement-

కృష్ణంరాజుతో ఉన్న‌ అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ..ఆయ‌న నాకు అత్మీయ మిత్రుడు, ఎప్పుడు క‌లిసిన ఆప్యాయంగా మాట్లాడేవార‌ని అన్నారు.

మరిన్ని వార్తలు చదవండి 

Prabhas- Anushka: మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాస్‌- అనుష్క‌ల పెళ్లి.. సడెన్‌గా ఈ ట్విస్ట్ ఏంది?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News