Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో కలివిడిగా మెలిగే కృష్ణంరాజు ఆకస్మిక మరణం సినీ ప్రముఖులతో పాటు అభిమానులని ఎంతగానో కలిచి వేసింది.
ఇటీవలే హైదరాబాద్ లో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహించగా, త్వరలో కృష్ణంరాజు సొంతూరు అయిన మొగల్తూరులో స్మారక సభ నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సంస్మరణ సభకి వచ్చే వారందరికీ భోజనం పెట్టి పంపించాలని ఫిక్స్ అయ్యారు.
కృష్ణంరాజు ప్రత్యేక విగ్రహం..
దాదాపు 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణానికి వయోభారమే కారణమని.. వేరే సమస్యలు ఏం లేవని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ప్రభాస్ తన పెద్దనాన్నని ఎంతో ప్రాణంగా ప్రేమించేవాడు.
ఇప్పుడు ఆయన లేని లోటుని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన రూపాన్ని నిత్యం స్మరించుకునేలా విగ్రహాన్ని తయారుచేస్తున్నారు ప్రభాస్.ఈ పనులను శిల్పి వడయార్‌కు అప్పగించినట్టు తెలుస్తుంది.
కృష్ణంరాజు కుటుంబసభ్యుల సూచనల మేరకు వడయార్ ఆరు రోజులు శ్రమించి ఫైబర్‌తో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారుచేశారు. ఇక శిల్పి వడయార్ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అని , ఆయన మరణం తనకు ఎంతో బాధను కలిగించిందని అన్నారు.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు తాను కేవలం 4 రోజుల్లోనే ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు స్పష్టం చేశారు.
నేడు ఆ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు పంపుతున్నట్లు శిల్పి వడయార్ స్పష్టం చేశారు. ఇక కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11 తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సినీ ప్రముఖులు అందరు కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.