Kousalya: టాలీవుడ్‌లో చాలా మంది ప్లే బ్యాక్ సింగర్స్ తమదైన టాలెంట్‌తో మంచి గుర్తింపు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కౌసల్య ఎన్నో వందల పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఒకప్పుడు వరుస సినిమాలలో పాడిన కౌసల్య అనంతరం తనకు ఎదురైన వ్యక్తిగత కారణాలు, పర్సనల్ లైఫ్‌లోని స్ట్రగుల్స్ కారణంగా ఆమె పాటలు కాస్త తగ్గించింది. ఇక ఇప్పుడు మళ్లీ యాక్టివ్ కావాలనుకుంటున్న నేపథ్యంలో తన జీవితంలోని స్ట్రగుల్స్ ని బయటపెట్టింది. భర్తతో ఎదురైన ఇబ్బందులను తెలియజేసింది.
మ్యారేజ్ లైఫ్‌లో ఎన్నో బాధలని అనుభవించిన కౌసల్య తన బాబు చిన్న పిల్లవాడు కావడంతో అతడి కోసమే తాను అన్నింటిని దిగమింగుకున్నట్టు చెప్పింది. తనకు సంబంధించిన బాధలన్నీ అమ్మ దగ్గర చెప్పుకునే దానిని అని కౌసల్య చెప్పింది.
తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకుపోదామని ఓపికగా అన్ని భరించానని పేర్కొంది. ప్రస్తుతం తన కుమారుడు పెద్ద వాడయ్యాడని, ఇప్పుడు తనని మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడని చెప్పుకొచ్చింది. తన జీవితంలో సంతోషం చూడాలనేది వాడి కోరిక అంటూ కౌసల్య చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.
also read :