స్వపక్షంనే తిరుగుబాటు చేసి వార్తల్లో నిలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ప్రస్తుతం రోజుకో టాపిక్‌తో మీడియా ముందుకు వస్తున్నారు. అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆత్మీయ సమావేశం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ వేదికపై కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. నామినేషన్‌కు ముందురోజు వైసీపీ కండువా కప్పుకున్నాడని కోటంరెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి తనను విమర్శించడం చోద్యంగా ఉందన్నారు.
నెల్లూరు రూరల్‌లో రెండు వందల కోట్లు, మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి తన సంగతితేలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పారు. అయితే, వీరందరి సంగతి 2024 లో చెబుతానన్నారు.
వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గం నుంచి ప్రజాభిమానం పొందుతానని చెప్పారు. ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలి కానీ వందల కోట్లతో విజయం సాధించలేరని కోటంరెడ్డి చెప్పారు. కార్పొరేటర్ల సంఖ్య ప్రధానం కాదన్న కోటంరెడ్డి.. ఆఖర్లో పార్టీ మారే స్వభావం తనది కాదన్నారు.
అవమానాలు ఎదుర్కొన్న చోటు ఉండలేక బయటకు వచ్చానన్నారు. ఇచ్చిన జీవోలకు కూడా నిధులు రాకపోవడంతో ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోయానన్నారు.
విధిలేని పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకొచ్చానని, 2024లో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఓ సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. అమరావతి రైతులు పాదయాత్ర సమయంలో నెల్లూరులోని ఓ కల్యాణ మండపంలో ఉంటే వారిని పలకరించడమే తాను చేసిన తప్పా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వంపై వెనక్కి తగ్గేదే లేదని, ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆత్మీయ సమావేశంలో పలువురు మహిళా నేతలు కోటంరెడ్డికి మద్దతు తెలిపారు.
Also read :
KA Paul On Revanth Reddy : టెర్రరిస్టులా రేవంత్ వ్యాఖ్యలు.. వెంటనే అరెస్టు చేయాలి..
Viral Video : కమలా హ్యారిస్ భర్తకు జిల్ బైడెన్ లిప్ కిస్..