HomesportsKohli: రోహిత్‌కి మ‌తి మ‌రుపు చాలా ఎక్కువే.. ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కోహ్లీ

Kohli: రోహిత్‌కి మ‌తి మ‌రుపు చాలా ఎక్కువే.. ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కోహ్లీ

Telugu Flash News

Kohli: భార‌త హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ స్టార్ బ్యాట్స్‌మెన్‌ల‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న క్రీజ్‌లో ఉన్న‌ప్పుడు బౌల‌ర్స్ గుండెల‌లో ద‌డ పుట్ట‌డం ఖాయం. అయితే గ‌త కొద్ది రోజులుగా ఫామ్ లేమితో స‌త‌మ‌తం అవుతున్నాడు రోహిత్ శ‌ర్మ‌. రీసెంట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ సాధించి ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టే క‌నిపించాడు. అయితే అదే మ్యాచ్‌లో టాస్ వేస్తున్న‌ప్పుడు న‌వ్వులు పూయించాడు. టాస్ గెలిచి త‌న నిర్ణ‌యాన్ని చెప్పేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. బౌలింగ్ ఎంచుకుంటాడా? లేక బ్యాటింగ్ తీసుకుంటాడా? అన్నది చెప్పకుండా తల గోక్కుంటూ అలానే నిల్చుండిపోయాడు.

కొద్ది సేప‌టి త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని చెప్పి హ‌మ్మ‌య్య అనిపించాడు. అయితే ఈ మ్యాచ ద్వారా అత‌ని మ‌తిమ‌రుపు ఏంటో అందికి అర్ధ‌మైంది. ‘రోహిత్ మరో గజినీ..’ అంటూ వీడియోలు.. మీమ్స్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఇది రోహిత్ కు ఉన్న మతిమరుపులో 1% మాత్రమే నట. 100 % చెప్పాలంటే.. సమయం సరిపోదని అంటున్నాడు విరాట్ కోహ్లీ.. విరాట్ చెప్పిన దానిని బట్టి చుస్తే.. రోహిత్ మర్చిపోని వస్తువంటూ ఏదీ లేదు. ‘ఐప్యాడ్, ఫోన్, వ్యాలెట్, వాచ్.. ఇలా ప్రతి ఒక్కటీ ఏదో స‌మ‌యంలో మర్చిపోతుంటాడట. మర్చిపోయిన సంగతి ఎవరైనా చెప్పినా.. పోనీ, కొత్తది తీసుకుంటాలే..’ అని ఫన్నీగా సమాధానమిస్తాడట ఈ హిట్ మ్యాన్.

మ‌ర‌చిపోయిన‌వి త‌న‌కు గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా .. ‘షట్ ఫ్లైట్ లో నా ఐప్యాడ్ మర్చిపోయా.. నా వాచ్ మర్చిపోయా..’ అని చెప్తుంటాడట. ఒకటి.. రెండు సార్లు పాస్ పోర్ట్ మర్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయ‌ని విరాట్ అన్నాడు. అందువల్ల జట్టు లాజిస్టిక్స్ సిబ్బంది ఒకరు.. రోహిత్ సామాన్లు అన్ని వచ్చినట్టేనా అని నిరంతరం ప్రశ్నించ‌డంతో పాటు ఆ ప్రశ్నలకు రోహిత్ అంగీకరించాకనే బస్ బయలుదేరుతుందట. అయితే, క్రికెట్ కు సంబంధించినవి మాత్రం ఎప్పుడూ ఏది మర్చిపోడట. రోహిత్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఇలా రోహిత్ గురుంచి ఎన్నో ఆసక్తికర విషయాలు కోహ్లీ వెల్లడించాడు. అయితే “పాపం.. ఈ మతిమరుపు మహారాజుతో.. రితికా సాజ్దే ఎలా నెట్టుకొస్తుందో..” అని అభిమానులు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News