HomesportsKohli: మ‌ళ్లీ కోహ్లీపై ట్రోల్స్ మొద‌లు.. క్యాచ్ డ్రాప్ అయితేనే సెంచ‌రీ చేయ‌గ‌ల‌డు..!

Kohli: మ‌ళ్లీ కోహ్లీపై ట్రోల్స్ మొద‌లు.. క్యాచ్ డ్రాప్ అయితేనే సెంచ‌రీ చేయ‌గ‌ల‌డు..!

Telugu Flash News

Kohli: ఒక‌ప్పుడు ప‌రుగుల వ‌ర‌ద పారించిన కోహ్లీ ఆసియా క‌ప్‌కి ముందుకు ప‌రుగులు రాబ‌ట్టాడానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మాదిరిగా ఆడుతూ వ‌చ్చిన కోహ్లీని నెటిజ‌న్స్ తో పాటు సీనియ‌ర్ క్రికెటర్స్ తిట్టిపోసారు. అవ‌న్నీ భ‌రిస్తూ మౌనంగా ఉన్నాడు కోహ్లీ. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఆసియా క‌ప్‌లో అద్భుత‌మైన సెంచ‌రీతో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చిన కోహ్లీ టీ 20 వ‌రల్డ్ క‌ప్‌లో అద‌ర‌గొట్టాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ ఔటైన‌ప్ప‌టికీ కోహ్లీ మాత్రం ఒంట‌రి పోరు చేసి చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. పాకిస్తాన్‌పై ఆయ‌న ఆడిన అద్భుత‌మైన ఇన్నింగ్స్ విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించింది.

అయితే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత న్యూజిలాండ్ సిరీస్ జ‌రిగిన ఆ మ్యాచ్‌ల‌కి కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి బంగ్లా సిరీస్ తో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్ తో జ‌రిగిన వ‌న్డేల‌లో దారుణంగా నిరాప‌ర‌చిన కోహ్లీ ప్ర‌స్తుతం జరుగుతున్న తొలి టెస్టులో తేలిపోయాడు. కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ త్వరగా అవుటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కానీ ఈ అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తైజుల్ ఇస్లాం వేసిన బంతిని బ్యాక్ ఫుట్ పై ఆడేందుకు ప్ర‌య‌త్నించగా, బంతి టర్న్ అవడంతో అతని అంచనా తప్పింది. దీంతో ఎల్బీగా అవుట్ అయ్యాడు. అవతలి ఎండ్ లో ఉన్న పుజారాను సంప్రదించి ఒక రివ్యూ కూడా తీసుకున్నాడు కోహ్లీ. కానీ అంపైర్ నిర్ణయం మారలేదు.

ప్ర‌స్తుతం అభిమానులు కోహ్లీపై సెటైర్ లు వేస్తున్నారు. డెడ్ రబ్బర్ మ్యాచులు, డ్రాప్ క్యాచులు లేకపోతే కోహ్లీ పరుగులు చెయ్యలేడు అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ చేసింది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన డెడ్ రబ్బర్ మ్యాచులో అన్న సంగతి తెలిసిందే. దానికితోడు ఆ మ్యాచులో కోహ్లీ ఇచ్చిన సులభమైన క్యాచును ఆఫ్ఘన్ ఫీల్దర్లు జారవిడిచారు. తాజాగా బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో కూడా కోహ్లీ శతకం చేశాడు. కానీ ఆ మ్యాచులో కూడా కోహ్లీ క్యాచును బంగ్లా ఫీల్డర్లు వదిలేశారు. ఇదిలా ఉంటే బంగ్లాపై భారత జట్టు గెల‌వ‌డం చాలా కీలకం. ఓడితే మాత్రం వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరడం అసాధ్యంగా మారుతుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News