HomesportsKohli: కోహ్లీకి సంక్రాంతి అంటే పూన‌కాలు లోడింగ్.. గ‌తంలోను..

Kohli: కోహ్లీకి సంక్రాంతి అంటే పూన‌కాలు లోడింగ్.. గ‌తంలోను..

Telugu Flash News

Kohli: ఒకప్పుడు ఫామ్ లేమితో నానా ఇబ్బందులు ప‌డ్డ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు చెల‌రేగిపోతున్నాడు. ఆసియా క‌ప్ నుండి మ‌నోడిని ఆప‌డం ఎవ‌రిత‌రం కావడం లేదు. శ్రీలంక తో జరిగిన‌ తుది వన్డేలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. మైదానంలో పరుగుల వాన కురిపించిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్ప‌డంతో ప‌రుగుల వ‌ర‌ద పారింది. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక వేగం పెంచిన ఈ రన్ మెషీన్.. ఆపై సెంచరీ బాదేసి వన్డేల్లో 46 సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్‌గా 74 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు కోహ్లీ.

మూడు వన్డేల ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది రెండో సెంచరీ. గువాహటిలో జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. సొంతగడ్డపై కోహ్లీకి ఇది 21వ వన్డే సెంచరీ. 20 సెంచరీలతో సచిన్ ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడా రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. అంతేకాదు, మరో మూడు సెంచరీలు సాధిస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ సరసన చేర‌డ్ ఖాయంగా క‌నిపిస్తుంది.

అయితే సంక్రాంతి అంటే కోహ్లీకి తెగ పూన‌కాలు వ‌చ్చేస్తుంటాయి. 2017లో సంక్రాంతి రోజే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌లో 112 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 2020 నుంచి 2022 ఆసియా కప్ వరకు సెంచరీ చేయని విరాట్ కోహ్లీ.. మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది అభిమానులకు పునకాలు తెప్పించాడు. ప్రస్తుతం ఈ గణంకాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా.. సంక్రాంతి రోజు విరాట్ కోహ్లీ సెంచరీ బాదడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News