HomesportsKohli: కోహ్లీ ఫిట్‌నెస్ ఇట్లుంట‌ది మ‌రి.. ఈ సీజ‌న్‌లో ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా గాయ‌ప‌డ‌లేద‌ట..!

Kohli: కోహ్లీ ఫిట్‌నెస్ ఇట్లుంట‌ది మ‌రి.. ఈ సీజ‌న్‌లో ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా గాయ‌ప‌డ‌లేద‌ట..!

Telugu Flash News

Kohli: క్రికెట్‌లో ఫిట్ నెస్ త‌ప్పనిస‌రి. లేదంటే గాయాల బారిన ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద ఆట‌గాడైన స‌రే ఫిట్ నెస్ లేక‌పోతే గాయాల బారిన ప‌డుతూ నెల‌ల త‌ర‌బ‌డి క్రికెట్‌కి దూరం అవుతుండ‌డం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. అయితే అంద‌రికి భిన్నంగా విరాట్ కోహ్లీ ఉంటాడు. అతని ఫిట్‌నెస్ లెవ‌ల్స్ చూస్తే ఎవ‌రికైన ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మానదు.

కోహ్లీ తన శరీరంపై జాగ్రత్త, డైటే కారణం. ఫిట్నెస్ పరంగా కోహ్లీ బెస్ట్‌గా ఉంటాడనేది తాజాగా మరోసారి నిరూపించ‌బ‌డింది.. 2021-22 సీజన్‌కు గానూ వివిధ గాయాలు, సమస్యల కారణంగా దాదాపు 23 మంది జాతీయ ఆటగాళ్లు జాతీయ క్రికెట్ అకాడమీ లో చికిత్స పొందారు. కానీ కోహ్లీకి మాత్రం ఒక్కసారి కూడా అక్క‌డికి వెళ్ల‌క‌పోవ‌డం విశేషం.

ద‌టీజ్ Kohli

మొత్తం 70 మంది ఆటాగాళ్లకు సంబంధించి 96 గాయాలకు ఎన్‌సీఏ వైద్య బృందం చికిత్స చేసిందని నివేదికలో తేలింది. ఇందులో 96 గాయాలకు సంబంధించి ఆటగాళ్లకు ఎన్సీఏలో చికిత్స జ‌ర‌గ‌గా, 70 మంది ఆటగాళ్లలో 23 మంది సీనియర్ ఇండియా ప్లేయర్లు కాగా, 25 మంది భారత్ ఏ టీమ్ తదితర క్రికెటర్లు, ఒకరు అండర్-19, ఏడుగురు సీనియర్ మహిళలు, 14 మంది రాష్ట్రాల ఆటగాళ్లు ఉన్నారని స‌మాచారం.

ప్ర‌స్తుత టీమిండియా నుండి రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్, పుజారా, ధావన్, హార్దిక్, ఉమేశ్, జడేజా, పంత్, శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్, చాహల్, సుందర్, కుల్దీప్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ తదితర ఆటగాళ్లు ఎన్సీఏలో చికిత్స పొందారు.

కాని కోహ్లీ మాత్రం గ‌త ఏడాది కాలంగా ఒక్క‌సారి కూడా ఫిట్‌నెస్ సమ‌స్య‌తో ఎన్సీఏకు వెళ్ల‌లేదు. దీనిని బ‌ట్టే తెలుస్తుంది. అత‌ని ఫిట్‌నెస్ లెవ‌ల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయ‌నేది. 2018లో విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా కౌంటీల్లో ఆడలేకపోయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుండి త‌న ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన కోహ్లీ అద్భుతంగా ఆడుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

మూడేళ్ల పాటు ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొన్న కోహ్లీ ఇప్పుడు పూర్తి ఫామ్‌లోకి వ‌చ్చి స‌త్తా చాటుతున్నారు. ఇక ఎన్సీఏలో చికిత్స తీసుకున్న యువ క్రికెటర్లలో శుబ్‌మన్ గిల్, పృథ్వీషా, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, కేఎస్ భరత్, నాగర్‌కోటి, సంజూశాంసన్, ఇషాన్ కిషన్, కార్తిక్ త్యాగి, నవదీప్ సైని, రాహుల్ చాహర్ తదితరులు ఉన్నారు.

-Advertisement-

ఇవి కూడా చదవండి :

మీ పిల్లలు మీ మాట వినటం లేదా..ఇలా చేసి చూడండి

మీ ముఖం ముద్దబంతిలా ముద్దమందారంలా మురిపించాలంటే

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News