నట సింహం నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) తాజా చిత్రం వీరసింహారెడ్డి (veera simha reddy) సంక్రాంతి సందర్బంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో వైసీపీ పార్టీ కి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని అందరికీ తెలిసిన సంగతే. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన డైలాగులపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సినిమాలో ప్రభుత్వ వ్యతిరేక డైలాగులను తొలగించే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని కొందరు అంటున్నారు. మరోవైపు సినిమాలో హింస ఎక్కువగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా డైలాగ్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani) వీరసింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వీరసింహారెడ్డి సినిమా చూడలేదని అన్నారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయని , వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్ చెపుతుంటారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగులు ఏపీ ప్రభుత్వానికి వెంట్రుక కూడా ఊడవని కొడాలి నాని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు వెనుక బాలయ్య దొంగలా నిలబడ్డారని కొడాలి నాని పేర్కొన్నారు.
బాలయ్య రీల్ హీరో అయితే జగన్ రియల్ హీరో అని కొడాలి నాని అన్నారు. మూడు రోజుల తర్వాత ఆ డైలాగులను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. ఇలాంటి డైలాగులతో బాలయ్య ఎన్నో సినిమాలు తీశారని కొడాలి నాని పేర్కొన్నారు.
కొడాలి నాని వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగిటివ్‌గా చెబుతున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి నాలుగు రోజుల్లో 104 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సీడెడ్, గుంటూరు జిల్లాల్లో ఈ సినిమా జోరు కొనసాగుతోంది. మరి రేపటితో ముగియనున్న సెలవుల దృష్ట్యా వీక్ డేస్ లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
also read news:
Viral video : తన జుట్టును ఇచ్చేసిన క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళ.. బార్బర్ ఏం చేశాడంటే!
Face oils for skin : ఫేస్ ఆయిల్స్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఎలా వాడాలో తెలుసుకోండి..
Kohli: కోహ్లీకి సంక్రాంతి అంటే పూనకాలు లోడింగ్.. గతంలోను..
Kodi Pandalu : ఏపీలో విచ్చలవిడిగా కోడి పందాలు.. ఎన్నికోట్లు చేతులు మారాయంటే..!