coriander leaves benefits : ఏదైనా కూరలో కాస్త కొత్తిమీర చల్లితే చాలు. ఆ ఘుమఘుమలు తినాలనే కోరికను పెంచుతాయి. రుచిని రెట్టింపు చేస్తుంది. అంతే కాదండోయ్ పోష కాలు చాలా ఎక్కువే.
ఒత్తిడి అయినా, బీపీ ఎక్కువ అయినా మీ వంటకాల్లో కొత్తిమీర వేసుకోండి. సలాడ్లపైనా కొంత కొత్తిమీర చల్లి తినండి. ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రిస్తాయి. ఫలితంగా, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
కంటిచూపు మందగిస్తే కొత్తిమీరతో చేసిన వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫాస్పరస్ ఉన్నాయి. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. కంటి ఒత్తిడిని నియంత్రిస్తుంది. అలాగే ఇందులోని బీటాకెరాటిన్ వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలను నియంత్రిస్తుంది.
కొత్తిమీర వికారం మరియు అజీర్ణానికి మంచి ఔషధం. ఇందులో ఉండే పీచు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు నోటి అల్సర్లను నివారిస్తాయి. ఎముకల దృఢత్వానికి అవసరమైన ఖనిజాలు మరియు కాల్షియం ఇందులో పుష్కలంగా ఉన్నాయి. హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. బహిష్టు నొప్పులు కూడా తగ్గుతాయి.
also read :
make up tips : చినుకులకు కరిగిపోకుండా వర్షాకాలం లో మేకప్ ఎలా వేసుకోవాలి ? ఈ చిట్కాలు పాటించండి!
child anger : పిల్లల్లో కోపం ఎందుకు వస్తుంది ? తల్లిదండ్రులు ఏం చేయాలి?
Anasuya Bharadwaj Latest Photos, Images in September 2023