kitchen tips in telugu for you :
- నాన్స్టిక్ పాత్రలు, పెనాలను సులభంగా శుభ్రం చేయా లంటే వాటిలో వేడి నీటిని పోసి పది నిముషాలసేపు అలాగే ఉంచి తరువాత క్లీనింగ్ పౌడర్ తో కాని డిట ర్జెంట్తో కాని కడగాలి.
- వెండి పాత్రలు, ఆభరణాలు తళతళా మెరవాలంటే ఉప్పుతోకానీ బూడిదతో కానీ శుభ్రం చేయాలి.
- బిర్యానీ, ఫ్రైడ్లైస్, పుదీనా రైస్ వంటివి రుచి, వాసనతో కొత్తదనం కావాలంటే బియ్యాన్ని ముందుగా వేయించాలి.
- కూరల్లో ఉప్పు ఎక్కువయితే బంగాళాదుంప ముక్కలను వేయాలి.
- గారెల పిండి నూనెలో వేయగానే విడిపోతుంటే పిండిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి కలపాలి.
- పులుసు పలచనయితే బియ్యపిండి కాస్త నీటిలో కలిపి అందులో పోసి ఉడకపెట్టుకోవాలి.
- డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ నాలుగైదు కరివేపాకు రెమ్మలు పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు.
- కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగితే వెంటనే గాయానికి పసుపు అద్దితే త్వరగా మానటమే కాక సెప్టిక్ అవదు.
- ఫ్రెష్ బ్రెడ్ మెత్తగా ఉండి ముక్కలుగా కోయటం కష్టమైనప్పుడు చాకును మంట దగ్గరిగా పెట్టి వేడి చేసి వాడితే పని తొందరగా అవుతుంది.
- పప్పు త్వరగా ఉడకాలన్నా మరింత రుచిగా ఉండాలన్నా అందులో ఒక టీస్పూన్ నువ్వులనూనె వేయాలి.
Also Read :
Shubman Gill : రష్మికపై క్రష్ ఉందన్న యువ క్రికెటర్
Medaram jathara : సమ్మక్క సారక్కలు ఎవరు ? మేడారం జాతర విశేషాలు తెలుసుకోండి
Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?