Homelifestylekitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)

kitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)

Telugu Flash News

kitchen tips in telugu for you :

  1. నాన్స్టిక్ పాత్రలు, పెనాలను సులభంగా శుభ్రం చేయా లంటే వాటిలో వేడి నీటిని పోసి పది నిముషాలసేపు అలాగే ఉంచి తరువాత క్లీనింగ్ పౌడర్ తో కాని డిట ర్జెంట్తో కాని కడగాలి.
  2. వెండి పాత్రలు, ఆభరణాలు తళతళా మెరవాలంటే ఉప్పుతోకానీ బూడిదతో కానీ శుభ్రం చేయాలి.
  3. బిర్యానీ, ఫ్రైడ్లైస్, పుదీనా రైస్ వంటివి రుచి, వాసనతో కొత్తదనం కావాలంటే బియ్యాన్ని ముందుగా వేయించాలి.
  4. కూరల్లో ఉప్పు ఎక్కువయితే బంగాళాదుంప ముక్కలను వేయాలి.
  5. గారెల పిండి నూనెలో వేయగానే విడిపోతుంటే పిండిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి కలపాలి.
  6. పులుసు పలచనయితే బియ్యపిండి కాస్త నీటిలో కలిపి అందులో పోసి ఉడకపెట్టుకోవాలి.
  7. డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ నాలుగైదు కరివేపాకు రెమ్మలు పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు.
  8. కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగితే వెంటనే గాయానికి పసుపు అద్దితే త్వరగా మానటమే కాక సెప్టిక్ అవదు.
  9. ఫ్రెష్ బ్రెడ్ మెత్తగా ఉండి ముక్కలుగా కోయటం కష్టమైనప్పుడు చాకును మంట దగ్గరిగా పెట్టి వేడి చేసి వాడితే పని తొందరగా అవుతుంది.
  10. పప్పు త్వరగా ఉడకాలన్నా మరింత రుచిగా ఉండాలన్నా అందులో ఒక టీస్పూన్ నువ్వులనూనె వేయాలి.

Also Read :

Shubman Gill : ర‌ష్మిక‌పై క్రష్ ఉందన్న యువ క్రికెట‌ర్

Medaram jathara : సమ్మక్క సారక్కలు ఎవరు ? మేడారం జాతర విశేషాలు తెలుసుకోండి

Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News