kitchen tips in telugu
- కుక్కర్ అడుగుభాగం నల్లగా అయితే రెండు చిన్న బంగాళాదుంప ముక్కల్ని వేసి వేడి చేసి ఆ నీటిలో కడిగితే తళ తళ !
- గోధుమరవ్వను బాగా వేయించి అరగంటసేపు నీళ్ళలో నానబెట్టి దోసెలు వేస్తే విరిగిపోకుండా రావటమే కాకుండా రుచిగా ఉంటాయి.
- రసం చేసిన తర్వాత మరిగే సమయంలో బెండకాయ ముక్కల్ని వేస్తే రుచికి రుచి సువాసనకి సువాసన !
- బాగా తలనొప్పిగా ఉందా ? ధనియాలను నీటిలో కలిపి నూరి తలకు పట్టిస్తే తగ్గిపోతుంది.
- కేక్ తయారు చేసేటప్పుడు కేక్ టిన్ అడుగు భాగంలో ఒక రేపర్ కాగితాన్ని ఉంచి దానిపై వెన్న రాసి మరో రేపర్ కాగితాన్ని కూడా ఉంచి వెన్నరాసి పిండి అందులో వేసి చెక్ చేస్తే అడుగు భాగం గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది.
- బీరకాయ, సొరకాయ తొక్కలను పారేయకుండా పచ్చడి చేసుకోవచ్చు.
- గులాబ్జమ్ పాకం మిగిలితే ఆ పాకంలో కరకరలాడే పూరీలను నానబెట్టి తింటే రుచిగా ఉంటాయి.
- పూరీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేప్పుడు ఒక చెంచా పంచదార కలిపితే చాలు.
- అగరొత్తుల ఖాళీ పెట్టెలను బీరువాలో చీరల మధ్య ఉంచితే చీరలు కూడా సుగంధాలు విరజిమ్ముతాయి.
- ధనియాలు నానబెట్టిన నీటిలో ముంచిన తడిగుడ్డను కనురెప్పలపై ఉంచితే కండ్లకలక, కళ్ళుమండటం, కళ్ళనుంచి నీరు కారటం తగ్గుతుంది.
also read :
kitchen tips in telugu : వంటింటి చిట్కాలు (18-07-2023)
kitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)
-Advertisement-