kitchen tips in telugu
- ఉడికించే ముందు కోడిగుడ్డు పెంకుపై నిమ్మరసం రాస్తే ఉడుకుతుండగా గుడ్డు పగలదు.
- మీ ఇంట్లో నేల తళతళలాడాలంటే ఫినాయిల్తోపాటు కొద్దిగా కొబ్బరినూనె కూడా వేసి తుడవండి.
- ఎక్కువగా మరిగిన నూనెలో చిన్న పిండిముద్ద వేస్తే తర్వాత వంటకాలు మాడకుండా ఉంటాయి.
- వెల్లుల్లికి నూనె రాసి ఎండబెడితే పొట్టు త్వరగా వస్తుంది.
- కరెంట్ స్విచ్ వేసి ఉన్నప్పుడు ప్లగ్లను లాగడం, పెట్టడం ప్రాణాలకే ప్రమాదం.
- పచ్చిమిరపకాయల ముద్దలో ఉప్పు కలిపితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
- కత్తి అంచులు తుప్పు పడితే పెద్ద ఉల్లిపాయలో గుచ్చి కొద్దిసేపు ఉంచాలి. తరువాత ఆరనిచ్చి వాడాలి.
- జిడ్డుగా ఉన్న గిన్నెలో వేడినీళ్ళు, ఉప్పు వేసి కొన్ని గంటల తరువాత కడిగితే జిడ్డు పోతుంది.
- కాలిన చోట వెంటనే బంగాళాదుంప ముక్కను రాస్తే ఉపశమనం కలుగుతుంది.
- బ్లాటింగ్ పేపరుపైన తేనె వేసినపుడు అది ఇంకిపోతే స్వచ్ఛమైనది కాదన్నమాట.
- ఆపిల్ తొక్కతో ఇత్తడి పాత్రలు, యాష్రలు వంటివి తోమితే నిగనిగ లాడుతాయి.
- కొత్త బియ్యాన్ని వండేటప్పుడు కాస్త ఉప్పును,మంచినూనెను ఎసట్లో వేస్తే అన్నం ముద్దగా ఉండదు.
- నిమ్మకాయ చెక్కను పిండాక అరగంట ఉంచి పిండితే మళ్ళీ రసం వస్తుంది.
- పన్నీరువాటర్ ఉంటే పారపొయ్యద్దు. ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే బలమే బలం.
- బెండకాయలు తాజాగా ఉండాలంటే వాటిని రెండు వైపులా కత్తిరించి ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచాలి.
- చేపలు వేపుడు చేసేటప్పుడు చేప ముక్కలకు కాస్తంత బియ్యప్పిండి రాస్తే వేయించేటప్పుడు ముక్కలు బాణలీకి అంటుకోకుండా ఉంటాయి.
- పంటిచిగుళ్ళు నొప్పి పుడుతుంటే నాలుగు జామ ఆకులు నమిలితే ఉపశమనం.
- వేరుశెనగ గుళ్ళు వేయించే ముందు వాటి మీద నీటిని చిలకరిస్తే, వేయించినప్పుడు అన్నీ ఒకే రంగులో వేగటమేకాకుండా తోలుకూడా సులభంగా వస్తుంది.
- నిమ్మకాయలను రసం తీసేముందు వేడినీటిలో, కాసేపు ఉంచితే ఎక్కువ రసం వస్తుంది.
- అన్నం మిగిలినప్పుడు దానిలో పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, జీలకర్రలను మెత్తగా దంచి కలిపి వడియాల్లాగా ఎండబెట్టి ఉపయోగించుకోవచ్చు.
- వెన్నలోంచి చెడువాసన వస్తుంటే కరివేపాకు, కొత్తిమీర కరగ బెట్టేముందే కలపాలి. ఆ తరువాత ఫిల్టర్ చేస్తే ఆ నెయ్యి మహా రుచి.
- వాడిన నిమ్మతొక్కలను ఉప్పులో అద్ది రుద్దితే రాగిపాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.
- మీ ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోకుండా ఉండాలంటే అందులో కాస్త ఉప్పురాస్తే చాలు.
- గ్లాసులు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోతే వాటిని ఒక రాత్రంతా ఫ్రిజ్లో ఉంచితే అవి సులభంగా విడిపోతాయి.
also read :