Homelifestylekitchen tips in telugu : వంటింటి చిట్కాలు (18-07-2023) 

kitchen tips in telugu : వంటింటి చిట్కాలు (18-07-2023) 

Telugu Flash News

kitchen tips in telugu

  1. ఉడికించే ముందు కోడిగుడ్డు పెంకుపై నిమ్మరసం రాస్తే ఉడుకుతుండగా గుడ్డు పగలదు.
  2. మీ ఇంట్లో నేల తళతళలాడాలంటే ఫినాయిల్తోపాటు కొద్దిగా కొబ్బరినూనె కూడా వేసి తుడవండి.
  3. ఎక్కువగా మరిగిన నూనెలో చిన్న పిండిముద్ద వేస్తే తర్వాత వంటకాలు మాడకుండా ఉంటాయి.
  4. వెల్లుల్లికి నూనె రాసి ఎండబెడితే పొట్టు త్వరగా వస్తుంది.
  5. కరెంట్ స్విచ్ వేసి ఉన్నప్పుడు ప్లగ్లను లాగడం, పెట్టడం ప్రాణాలకే ప్రమాదం.
  6. పచ్చిమిరపకాయల ముద్దలో ఉప్పు కలిపితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
  7. కత్తి అంచులు తుప్పు పడితే పెద్ద ఉల్లిపాయలో గుచ్చి కొద్దిసేపు ఉంచాలి. తరువాత ఆరనిచ్చి వాడాలి.
  8. జిడ్డుగా ఉన్న గిన్నెలో వేడినీళ్ళు, ఉప్పు వేసి కొన్ని గంటల తరువాత కడిగితే జిడ్డు పోతుంది.
  9. కాలిన చోట వెంటనే బంగాళాదుంప ముక్కను రాస్తే ఉపశమనం కలుగుతుంది.
  10. బ్లాటింగ్ పేపరుపైన తేనె వేసినపుడు అది ఇంకిపోతే స్వచ్ఛమైనది కాదన్నమాట.
  11. ఆపిల్ తొక్కతో ఇత్తడి పాత్రలు, యాష్రలు వంటివి తోమితే నిగనిగ లాడుతాయి.
  12. కొత్త బియ్యాన్ని వండేటప్పుడు కాస్త ఉప్పును,మంచినూనెను ఎసట్లో వేస్తే అన్నం ముద్దగా ఉండదు.
  13. నిమ్మకాయ చెక్కను పిండాక అరగంట ఉంచి పిండితే మళ్ళీ రసం వస్తుంది.
  14. పన్నీరువాటర్ ఉంటే పారపొయ్యద్దు. ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే బలమే బలం.
  15. బెండకాయలు తాజాగా ఉండాలంటే వాటిని రెండు వైపులా కత్తిరించి ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచాలి.
  16. చేపలు వేపుడు చేసేటప్పుడు చేప ముక్కలకు కాస్తంత బియ్యప్పిండి రాస్తే వేయించేటప్పుడు ముక్కలు బాణలీకి అంటుకోకుండా ఉంటాయి.
  17. పంటిచిగుళ్ళు నొప్పి పుడుతుంటే నాలుగు జామ ఆకులు నమిలితే ఉపశమనం.
  18. వేరుశెనగ గుళ్ళు వేయించే ముందు వాటి మీద నీటిని చిలకరిస్తే, వేయించినప్పుడు అన్నీ ఒకే రంగులో వేగటమేకాకుండా తోలుకూడా సులభంగా వస్తుంది.
  19. నిమ్మకాయలను రసం తీసేముందు వేడినీటిలో, కాసేపు ఉంచితే ఎక్కువ రసం వస్తుంది.
  20. అన్నం మిగిలినప్పుడు దానిలో పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, జీలకర్రలను మెత్తగా దంచి కలిపి వడియాల్లాగా ఎండబెట్టి ఉపయోగించుకోవచ్చు.
  21. వెన్నలోంచి చెడువాసన వస్తుంటే కరివేపాకు, కొత్తిమీర కరగ బెట్టేముందే కలపాలి. ఆ తరువాత ఫిల్టర్ చేస్తే ఆ నెయ్యి మహా రుచి.
  22. వాడిన నిమ్మతొక్కలను ఉప్పులో అద్ది రుద్దితే రాగిపాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.
  23. మీ ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోకుండా ఉండాలంటే అందులో కాస్త ఉప్పురాస్తే చాలు.
  24. గ్లాసులు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోతే వాటిని ఒక రాత్రంతా ఫ్రిజ్లో ఉంచితే అవి సులభంగా విడిపోతాయి.

also read :

kitchen tips (08-03-2023) : ఈ 9 వంటింటి చిట్కాలు మీ కోసం..

kitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News