పురుషులదే రాజ్యంగా సాగుతున్న ఆ కాలంలోనే మహిళలు ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తూ అందర్నీ ఆశ్చర్య పరిచిన కిరణ్ మజుందార్ షా (kiran mazumdar shaw) గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా…అయితే ఈ స్టొరీ చదవండి.
1953,మార్చ్ 23న కర్ణాటకలోని బెంగళూర్ లో గుజరాతీ కుటుంబంలో జన్మించిన కిరణ్ మజుందార్ షా చిన్న వయసు నుండి చదువులో మెరుగ్గా ఉండేవారట.ఏదైనా సరే త్వరగా గ్రహించి అర్థం చేసుకునేవారట.
1968లో బిషప్ కాటన్ బాలికల ఉన్నత పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న ఆమె, ఆ తరువాత 1973లో బెంగళూర్ యూనివర్సిటీలో తన గ్రాడ్యువేషన్ని పూర్తి చేసుకుని మెడికల్ స్కూల్లో చదవాలని ఆశ పడగా స్కాలర్షిప్ రాకపోవడంతో నిరాశ చెందారు.
ఆ తరువాత తన తండ్రి ఫెర్మెంటేషన్ సైన్స్ (fermentation science) చదవమని చెప్పడంతో 1975లో మెల్బోర్న్ యూనివర్సిటీ లోని బల్లారాట్ కాలేజీలో మాస్టర్ బ్రూవర్ (brewer) గా డిగ్రీ పొందారు.
తన చదువు ముగిసిన తరువాత కార్ల్టన్ అండ్ యునైటెడ్ బ్రూవరీస్(carlton and United Breweries),బారెట్ బ్రదర్స్ మరియు బర్స్టన్(Barrett Brothers and Burston) సంస్థలలో ట్రైనీ (trainee) మరియు బరోడాలోని స్టాండర్డ్ మాల్టింగ్స్ కార్పొరేషన్లో మేనేజర్ గా కిరణ్ మజుందార్ పనిచేశారు.
ఇండియాలో మాస్టర్ బ్రూవర్ అవ్వాలని తను కోరుకోగా అది ఒక మగాడు చేయాల్సిన పని అని చెప్పి ఇక్కడ ఎవరూ ఆమెకు అవకాశం ఇవ్వలేదు.దీంతో మరోసారి తన జీవితం ముందుకు సాగుతుందా… అని భయపడిన కిరణ్ మజుందార్ మరో సారి తన తండ్రి దైర్యం చెప్పడంతో మద్యం కంపెనీలకు సలహాలు ఇచ్చే సంస్థను ఒకటి స్థాపించారు.
ఆ తరువాత మద్యం, ఔషధాలు, ఆహార పదార్థాలలో ఎంజైమ్‌ల ప్రాధాన్యతను గుర్తించిన కిరణ్ వాటిని పరిశోధించి,వాటిపై పూర్తి అవగాహన తెచ్చుకోవడం కోసం ఐర్లాండ్ కి వెళ్ళారు.
అలా వెళ్ళిన ఆమె అక్కడ బయోకాన్ అధిపతి లెస్లీ ఆచిన్‌క్లోస్ ( Leslie Auchincloss) ని కలిశారు. అయితే ఆయనను కలవడం ఆమె జీవితాన్ని మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
బయోకన్ ప్రారంభం:
1977 లో లెస్లీ ఆచిన్‌క్లోస్ భారత పర్యటనకు రాగా, ఆ సమయంలో కిరణ్ కి బ్రూవరీ పై, జీవ సాంకేతిక రంగంపై ఆమెకి ఉన్న అసక్తి, అవగాహన గమనించిన ఆయన భారత్ లో బయోకన్ ప్రారంభించడంలో తన పార్ట్నర్ గా వ్యవహరించమని కోరగా ఆమె సరే అంది.
కానీ తను ఒక మహిళ కావడంతో బయోకన్ ని స్థాపించడానికి కావాల్సిన లోన్ ఇవ్వడానికి మొదట్లో ఎవరూ ముందుకు రాలేదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా గట్టి సంకల్పంతో ఉన్న ఆమె ఎలాగోలా లోన్ సాధించారు.
అలా మొదలు పెట్టిన బయోకన్ ని ఒక సంవత్సరంలో భారత దేశంలోనే తొలి ఎంజైమ్‌ల సంస్థగా నిలుపడమే కాక, పొరుగు దేశాలకు వాటిని ఎగుమతి చేయడం ప్రారంభించారు. వాటితో వచ్చిన లాభాలతో స్థలాన్ని కొని ఒక పూర్తి స్థాయి బయోకన్ కార్యాలయాన్ని స్థాపించారు.ఆ ఎంజైమ్‌ల కంపెనీని పూర్తి స్థాయి ఔషధ ఉత్పత్తుల కంపెనీగా తీర్చిదిద్దారు. ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే ఔషధాలను తయారు చేసి చాలా మంది ప్రాణాలను కాపాడారు.
ఒక మహిళ అయినప్పటికీ బయోటెక్నాలజీలో ఆమె తీసుకు వచ్చిన అభివృధికి గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో ఆమెను సత్కరించింది.
ఫోర్బ్స్ (Forbes) పత్రిక వాళ్ళు కిరణ్ మజుందార్ 2013లో 250 కోట్ల డాలర్ల నెట్ వర్త్ కలిగిన మహిళా గా పేర్కొంది.
ఇటు వ్యాపార రంగంలో అందర్నీ ఆశ్చర్య పరిచే వేగంతో దూసుకుపోతున్న కిరణ్ మజుందార్ 1998లో తనకు మనసుకు నచ్చిన జాన్ షాను పెళ్లాడగా 2022లో ఆయన క్యాన్సర్ వల్ల చనిపోయి ఆమెకు తీరని విషాదాన్ని మిగిల్చారు.
ఆమె భర్త చనిపోయినా సరే బాధకు లోనైందే తప్ప నిరాశ లొంగలేదు. తను ఎప్పటి లాగే కొండంత సంకల్పంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఇలా మగాళ్లకి దీటుగా తన సత్తా చాటిన కిరణ్ మజుందార్ షా గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
also read :
Telangana Congress : సర్పంచులకు బాసటగా కాంగ్రెస్.. ధర్నాకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు!