Telugu Flash News

kim kardashian and kanye west : విడాకుల దిశగా మరో హాలీవుడ్ జంట…భరణంగా నెలకు 1.6 కోటి…

Kim Kardashian settles divorce with Kanye West

Kim Kardashian settles divorce with Kanye West

కిమ్ కర్దాషియాన్ మరియు కాన్యే వెస్ట్ (kim kardashian and kanye west) తమ విడాకులను ధ్రువీకరించారు. కోర్టు పత్రాల ప్రకారం, కాన్యే వెస్ట్ మరియు కిమ్ కర్దాషియాన్ వారి నలుగురు పిల్లల బాధ్యత ఉమ్మడిగా స్వీకరించారు. అయితే, కిమ్ కర్దాషియాన్ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ, ఆమె దగ్గర పిల్లలు ఎక్కువ సమయం ఉంటారు అని వెల్లడించారు.

మీడియా సమాచారం ప్రకారం, కాన్యే నెలకు 2,00,000 USD చైల్డ్ సపోర్టుగా కిమ్ కర్దాషియాన్ కు అందిస్తాడు. పిల్లల చదువుల ఖర్చులు, ట్యూషన్లు, అలాగే సెక్యూరిటీ ఖర్చులలో కూడా సగం అతనిదే.

సెటిల్మెంట్ ప్రకారం, కర్దాషియాన్ మరియు వెస్ట్ తమ నలుగురు పిల్లలలో ఒకరి గురించి ఎప్పుడైనా విభేదిస్తే, వారు తప్పనిసరిగా మధ్యవర్తిత్వానికి వెళ్లాలి. ఒకవేళ మధ్యవర్తిత్వానికి హాజరు కాకపోతే, ఆ కమిటీ నిర్ణయాన్నే అంగీకరించాలి, ఆస్తులు అన్ని వారి ముందస్తు ఒప్పందంతో సమానంగా విభజించబడ్డాయి.

కిమ్ కాన్యేతో 2011లో డేటింగ్ ప్రారంభించింది. 2013లో వారి మొదటి కుమార్తె నార్త్‌ పుట్టింది. 2014లో, వారు పెళ్లి చేసుకున్నారు.

కిమ్ 2000 నుండి 2004 వరకు డామన్ థామస్‌ తో వివాహ బంధంలో ఉంది. ఆ తర్వాత 2011లో క్రిస్ హంఫ్రీస్‌ తో కేవలం 72 రోజులు వివాహ బంధంలో ఉండి అతనితో విడిపోయిన తర్వాత కాన్యే వెస్ట్ తో డేటింగ్ ప్రారంభించింది. ఈ వివరాల ప్రకారం కిమ్ కు ఇది మూడో పెళ్లి మరియు మూడో విడాకులు.

also read news: 

Cricketers: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు క్రికెట‌ర్స్.. అదీ సిరీస్ మ‌ధ్య‌లో…!

Ranjithame : ‘రంజితమే’ తెలుగు ఫుల్ సాంగ్ విడుదల.. జానీ మాస్టార్ కొరియోగ్రఫీతో.. తమన్ బీట్ తో జోరుగా .. హుషారుగా

 

Exit mobile version