ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim jong un).. 40 రోజులుగా కనిపించకుండా పోయి ఇప్పుడు కూతురితో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన అనారోగ్యంపై ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. దాదాపు నెల రోజులకుపైగా ఆయన మీడియాలో కూడా కనిపించకపోయే సరికి ప్రపంచ వ్యాప్తంగా అందరూ వివిధ రకాలుగా ఊహించుకున్నారు. కానీ తాజాగా ఆయన కూతురుతోపాటు కనిపించడం గమనార్హం.
తాజాగా ఉత్తర కొరియా దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన సైనికాధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె కూడా ఉన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. త్వరలో భారీ సైనిక పరేడ్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉత్తర కొరియా తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కిమ్.. సైన్యంలోని ఉన్నతాధికారులతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సాధారణంగా కిమ్.. తన కుమార్తెతో కనిపించడం అరుదు. అయితే, ఇప్పటికి నాలుగుసార్లు తన కుమార్తెతో కిమ్ కనిపించారు. ఈ నేపథ్యంలో పదే పదే కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై ఇప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి. భవిష్యత్‌లో తన కుమార్తెకు అప్పిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకే పదే పదే ఇటీవల వరుసగా కుమార్తెతో కలిసి సైన్యం వద్దకు వెళ్లడం, ఫొటోలు విడుదల చేయడం చేస్తున్నారని చెబుతున్నారు.
ఉత్తరకొరియా అధినేత కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తన వారసులే పగ్గాలు చేపడతారని సంకేతాలు ఇస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ కవాతు జరగనుంది. ఈ వారంలోనే జరగబోయే ఈ కార్యక్రమానికి దేశాధినేత హాజరై సైనిక బలాన్ని ప్రపంచానికి చూపిస్తారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఉత్తరకొరియా సైనికులు కవాతు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
also read:
PT Usha: రాజ్యసభలో అరుదైన సన్నివేశం.. సభను నిర్వహించిన పీటీ ఉష
Samantha: భారీ రేటుతో ముంబైలో ప్లాట్ కొన్న సమంత..!