Homecinemakiara advani : ఇంకా ఆ రహస్యాన్ని దాచలేను.. డిసెంబర్ 2 వరకు వేచి ఉండండి

kiara advani : ఇంకా ఆ రహస్యాన్ని దాచలేను.. డిసెంబర్ 2 వరకు వేచి ఉండండి

Telugu Flash News

kiara advani: అందాల ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. మంచి టైం చూసుకొని వాళ్ల పెళ్లి విష‌యాన్ని కొంద‌రు ప్ర‌కటిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఆ త‌ర్వాత విష‌యాన్ని చెబుతున్నారు ఇటీవ‌ల‌ అలియా భట్, నయనతార వంటి అందాల భామ‌లు పెళ్లి చేసుకోగా,ఇప్పుడు హన్సిక మౌత్వానీ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌హేష్ బాబు బ్యూటీ కియారా అద్వాని కూడా చేరింది. ఈ అమ్మ‌డు పెళ్లిపై ప్రస్తుతం గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే పెళ్లి కూడా పూర్తి కాబోతుందంటూ ప్రచారం న‌డుస్తుంది.

తాజాగా కియారా పెట్టిన పోస్ట్‌ని బ‌ట్టి ఆమె పెళ్లి త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని భావిస్తున్నారు. కియారా ఎప్ప‌టి నుండో బాలీవుడ్‌ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్‌లో ఉంది. ఇప్పటికే పరోక్షంగా తమ ప్రేమను అంగీకరించిన ఈ బాలీవుడ్ స్టార్స్ త్వరలో అఫిషియల్ ప్రకటన ఇవ్వబోతున్నాభావిస్తున్నారు. రీసెంట్‌గా కియారా అద్వానీ గా ఇన్ స్టాగ్రామ్ లో ‘ఇంకా ఆ రహస్యాన్ని దాచలేను. డిసెంబర్ 2 వరకు వేచి ఉండండి’ అని పేర్కొనగా , దీంతో పెళ్లిపైనే అధికారిక ప్రకటన ఇవ్వబోతుందని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు.

మరోవైపు కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని డిసెంబర్ 5న సిద్ధార్థ్ కియారా మెడలో తాళి కట్టబోతున్నారని,వీరి పెళ్లి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా చేయ‌బోతున్నార‌ని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కియారా తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు మ‌హేష్ న‌టించిన భ‌రత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకి ప‌రిచ‌యం కాగా, ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమాలో న‌టిస్తుంది.పొలిటికల్ డ్రామాతో పాటు యాక్షన్ పరంగానూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా రూపొందిస్తుండ‌గా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి రామ్ చరణ్ పవర్ ఫుల్ యాంటీ – కరప్షన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News