Telugu Flash News

Kiara Advani : పెళ్లై నెల రోజులు కాక‌ముందే కియారా ప్ర‌గ్నెంట్ అంటూ నెట్టింట వార్త హ‌ల్చ‌ల్

Kiara Advani: బాలీవుడ్‌ క్రేజీ కపుల్స్ లో ఒక‌టైన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట గతనెల 7న పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. రాజస్థాన్‌ లోని ప్యాలెస్‌ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక త‌ర్వాత ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కి సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.

అయితే వీరి వివాహం జరిగి నెల రోజులు కూడా తిరక్కుండానే, కియరా గర్భవతి అయిందంటూ ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే ఆ పుకార్ల‌కి కార‌ణం లేక‌పోలేదు.

తాజాగా కియారా అద్వాని మామిడి కాయ తింటూ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. ప్ర‌గ్నెంట్ తో ఉన్న వాళ్లే ఇలా మామిడి కాయ‌లు తింటార‌ని కొందరు జోస్యాలు చెప్పుకొస్తున్నారు.

గ‌తంలో అలియా భ‌ట్ కూడా పెళ్లైన‌ అతి తక్కువ సమయంలో ప్రెగ్నెంట్ అయ్యి అందరిని ఆశ్చర్య పరిచింది. తాజాగా ఆమె బాటలోనే కియారా అద్వానీ కూడా వ‌చ్చి చేరిందా అని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు .

అయితే slice యాడ్ కోసం కియారా అలా చేయ‌గా, కొంద‌రు అందుకు సంబంధించిన పిక్స్ వైర‌ల్ చేస్తూ పుకార్లు పుట్టిస్తున్నారు. కియారా తెలుగులో రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబుల‌తో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే.

also read :

Kiara Advani Latest Photoshoot for Slice in Yellow Dress

Kiara Advani at Zee Cine Awards 2023 Photos and Videos

Exit mobile version