Kiara Advani: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ ప్రేమాయణం గురించి ఎన్నో ప్రచారాలు జరిగాయి. కాని ఏ రోజు వారు స్పందించలేదు. అయితే ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్‌ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే.. ఈ వివాహ వేడుకకి కొద్దిమంది కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సెలబ్రిటీల విషయానికి వస్తే కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారట. మంగళవారం రాత్రి కియారా అద్వానీ తన ట్విట్టర్ వేదికగా తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ . ‘ఇప్పుడు మా శాశ్వత బుకింగ్ పూర్తయింది’ అని క్యాప్షన్ పెట్టారు. నూతన జీవితం ప్రారంభించబోతున్న తమకు అందరి ఆశీస్సులు, ప్రేమ కావాలని కియారా పేర్కొంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
“Ab humari permanent booking hogayi hai”
We seek your blessings and love on our journey ahead ❤️🙏 pic.twitter.com/AlBjfKrPtp
— Kiara Advani (@advani_kiara) February 7, 2023
also read:
Kiara Advani Sidharth Malhotra Wedding Photos
Varsha : కెరీర్ మొదట్లో వర్షని కూడా అంతగా ఇబ్బంది పెట్టారా..!