HomecinemaKiara Advani: మ‌హేష్ హీరోయిన్ కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతుందోచ్.. వెన్యూ ఎక్క‌డంటే..!

Kiara Advani: మ‌హేష్ హీరోయిన్ కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతుందోచ్.. వెన్యూ ఎక్క‌డంటే..!

Telugu Flash News

Kiara Advani: ఇటీవ‌ల చాలా మంది అందాల ముద్దుగుమ్మ‌లు న‌చ్చిన వ్యక్తితో పెళ్లి పీట‌లు ఎక్కి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పుడు మ‌హేష్ హీరోయిన్ కియారా అద్వాని టైం వ‌చ్చింది. మహేశ్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన కియారా ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే కొన్నాళ్లుగా హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న ఈ ముద్దుగుమ్మ అత‌నితో పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.

గత ఏడాది ‘షేర్షా’ చిత్రంలో నటించినప్పుడు ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. . షేర్షా సినిమాలో సిద్ధార్థ్‌, కియారా ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసిన‌ట్లు తెలిసింది. ఫిబ్రవరి 6న వీరి పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్‌ టాక్‌. మెహందీ, సంగీత్, పెళ్లి.. ఈ మూడు వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయట. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ప్యాలేస్‌ వివాహ వేదిక కానుందనీ, పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్‌.

also read:

ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్‌ తింటే తిరుగుండదు!

ఫేస్‌ ఆయిల్స్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఎలా వాడాలో తెలుసుకోండి..

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News