Kiara Advani : చాలా కాలం పాటు సీక్రెట్ ప్రేమాయణం నడిపించి ఎట్టకేలకు ఈ నెల 7న పెళ్లితో ఒక్కటయ్యారు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మలోత్రా జంట. కుటుంబ సభ్యులు, ప్రముఖులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
అయితే సంగీత్ కోసం కియారా వేసుకున్న లెహంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంగారం, వెండిలతో చేసిన ఈ లెహంగాను ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ లెహంగాకు 98 వేలకు పైగా క్రిస్టల్స్ వినియోగించినట్టు సమాచారం.
ఇక దీని తయారీ కోసం 4 వేల గంటల సమయం పట్టిందట. అంటే 150 రోజుల పాటు దీనిని రూపొందించారట మనీష్ మల్హోత్రా అండ్ టీం. అయితే ఈ లెహంగా రేటు మాత్రం బయటకు చెప్పలేదు కాని.. దీని ధర లక్షలలోనే ఉంటుందని జనాలు ముచ్చటించుకుంటున్నారు.
కియారాతో పాటు అటు మనీష్ మల్హోత్రా కూడా ఈ డ్రస్ కు సబంధించిన అద్భుతాలను వివరిస్తూ తమ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
View this post on Instagram
also read :
Mouni Roy Latest Hot Photos, Images, stills 2023
Dry eyes : కళ్లు పొడిబారిపోకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
Chandini Chowdary latest photos, images, stills 2023