Telugu Flash News

Harshavardhan : హృదయాన్ని కదిలించే కథ.. మరణానికి ముందే ఏర్పాట్లు చేసుకున్న యువకుడు..

khammam-harshavardhan

Harshavardhan: జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అకస్మాత్తుగా తలకిందులు కావడం చాలా మంది జీవితాల్లో జరుగుతుంటుంది. ఇలాంటి హృదయ విదారక ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. తన ప్రాణం పోతుందని తెలుసుకున్న యువకుడు తన మరణానికి ముందే ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడిన ఆ యువకుడు.. తల్లిదండ్రులు, స్నేహితులకు ధైర్యం చెప్పి ఓదార్చాడు.

చనిపోతానని తెలిసినా కూడా అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ, నవ్విస్తూ తాను అనంత లోకాలకు వెళ్లిపోయాడు. విదేశాల నుంచి తన మృతదేహాన్ని తరలించేందుకు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. నమ్మశక్యం కాని ఈ కథ ఖమ్మంలో చోటు చేసుకుంది. నగరంలోని శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కొడుకులు.

mushroom pepper fry : పుట్టగొడుగుల పెప్పర్ ఫ్రై రోటీల్లోకి చాలా బాగుంటుంది

రామారావు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తుంటాడు. ఆయన భార్య ప్రమీల గవర్నమెంట్‌ స్కూల్‌లో హెడ్‌ మాస్టర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌ (33) బీఫార్మసీ చేశాడు. హయ్యర్‌ స్టడీస్‌ కోసం ఆస్ట్రేలియాకు 2013లో వెళ్లాడు. అక్కడి బ్రిస్బేన్‌ యూనివర్సిటీలో హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ మెడిసిన్‌ కంప్లీట్‌ చేసి క్వీన్‌ల్యాండ్స్‌ నగరంలో ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో వైద్యుడిగా చేరాడు.

2020 ఫిబ్రవరి 20వ తేదీన ఖమ్మం వచ్చిన హర్షవర్ధన్‌.. ఓ యువతిని పెళ్లాడాడు. వీసా వచ్చాక ఆమెను కూడా ఆస్ట్రేలియా తీసుకెళ్తానని చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా వెళ్లి ఓ రోజు వ్యాయామం చేస్తుండగా దగ్గు వచ్చింది. తీవ్రమైన ఆయాసం రాగా.. ఆస్పత్రికి వెళ్లి చెకప్‌లు చేయించుకున్నాడు. అప్పుడు గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది. అతడి ఊపిరితిత్తులకు క్యాన్సర్‌ సోకిందని వెల్లడైంది.

moral stories in telugu : సరస్సులో చందమామ.. కథ చదవండి

అయితే, ధైర్యం కోల్పోకుండా మనోనిబ్బరంతో ఎదుర్కోవాలని డిసైడ్‌ అయ్యాడు. మెడిసిన్స్‌ సాయంతో కాస్త కోలుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం తెలియగా వారిని ఓదార్చాడు.ఇక తన పరిస్థితిని ముందే పసిగట్టిన హర్షవర్ధన్‌.. భార్యకు విషయం చెప్పి విడాకులు ఇచ్చాడు. ఆమె జీవితంలో సెటిల్‌ అయ్యేందుకు సాయం చేశాడు. అయితే, ఈలోగా క్యాన్సర్‌ మళ్లీ తిరగబెట్టింది.

ఈసారి వైద్యం చేయించుకున్నా ఫలితం లేదని, కొన్ని నెలల్లోనే మరణం తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం తన మరణానంతరం సొంత ప్రాంతానికి భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా లాయర్‌ను నియమించుకున్నాడు. స్నేహితులు, బంధువులకు విషయం ఫోన్లో చెప్పాడు.

Rana: ఒక్క‌సారిగా వార్త‌ల‌లోకి రానా భార్య‌.. శ‌భాష్ అంటూ పొగ‌డ్త‌లు

తల్లిదండ్రులకు కొండంత ధైర్యం చెప్పిన అతడు.. ఆరోగ్యం క్షీణించడంతో మార్చి 24న కన్ను మూశాడు. బుధవారం ఖమ్మంలోని ఇంటికి మృతదేహం చేరుకోవడంతో అందరూ బోరున విలపిస్తున్నారు.

Exit mobile version