అమెరికాలో నివసిస్తున్న, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు శుభవార్త. గ్రీన్ కార్డుల (Green Cards) జారీ విషయంలో అమెరికా కీలక మార్పులు చేయనుంది. ఒక్కో దేశానికి కేటాయించే కోటాను తొలగించడానికి యూఎస్ సిద్ధమైంది. ఈ మేరకు ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ఇందుకు వైట్ హౌస్ ఓకే చెప్పింది. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్‌మెంట్ (EAGLE)-2022 బిల్లుపై ఓటింగ్ చేపట్టనున్నారు.
ఈగల్ బిల్లుకు సంబంధించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ వారమే షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఓటింగ్ జరిపేందుకు నిర్ణయించింది. ఈ బిల్లు పాస్ అయితే భారతీయులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా ఇండో అమెరికన్‌లకు ఈ బిల్లు ప్రయోజనకరంగా మారనుంది. అమెరికన్ కంపెనీలకు మెరిట్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకొనే చాన్స్ కలగనుంది. ఇప్పటి వరకు ఉన్న విధంగా ఆయా దేశాల మెరిట్ కోటాను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.
అమెరికాలో గ్రీన్ కార్డును అధికారికంగా పర్మినెంట్ రెసిడెంట్ కార్డు అని కూడా అంటారు. యూఎస్‌కు వలస వచ్చిన వారు అక్కడ శాశ్వత ప్రాతిపదికన నివసించాలంటే అక్కడి ప్రభుత్వం జారీ చేసే ఈ గ్రీన్ కార్డు తప్పక పొందాల్సి ఉంటుంది. ఈగల్ బిల్లు పాస్ అయితే భారతీయులతో పాటు అనేక దేశాలపై ఉన్న పరిమితి తొలగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డుల జారీపై ఆంక్షలు తొలగిపోతాయి.
చట్టంగా మారితే భారతీయులకు మేలు..
ఈగల్ బిల్లు చట్టంగా మారిపోతే.. ఇక అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అమెరికా వెళ్లి స్థిరపడాలనుకున్న వారికి ఇది భారీగా ఊరట కలిగించే అంశంగా మారనుంది. తక్కువ జనాభా కలిగిన దేశాలకు చెందిన అర్హత ఉన్న వలసదారులపై ప్రభావం పడకుండా ఈగల్ బిల్లులో అనేక అంశాలను పొందుపరిచారు. ఈగల్ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే భారత్‌తోపాటు చాలా దేశాలకు ప్రయోజనకరంగా మారనుంది.
also read news:
Kantara క్లైమాక్స్ పీక్స్ : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్
How to be confident in any situation ? here are the 8 tips