HomesportsVirat Kohli: విరాట్ కోహ్లీకి శాపం పెట్టిన క్రికెట‌ర్‌.. ఆయ‌న‌పై ఎందుకంత ప‌గ‌...!

Virat Kohli: విరాట్ కోహ్లీకి శాపం పెట్టిన క్రికెట‌ర్‌.. ఆయ‌న‌పై ఎందుకంత ప‌గ‌…!

Telugu Flash News

Virat Kohli: టీమిండియాకి దొరికిన ఆణిముత్యం విరాట్ కోహ్లీ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. రికార్డుల‌ని అవ‌లీల‌గా చెరిపేస్తున్న కోహ్లీ మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ లేక తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఒకానొక స‌మ‌యంలో కోహ్లీ జ‌ట్టులో స్థానం కూడా కోల్పోతాడ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఆసియా కప్ ముందు నెలరోజులపైగా విశ్రాంతి తీసుకున్న అతను.. పునరాగమనంలో ప్రత్యర్థులకు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్కలు చూపిస్తున్నాడు. ఆసియా కప్‌లో పర్వాలేదనిపించి, పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌పై అత‌ను ఆడిన అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది.

సెమీస్‌లో ఆడొద్దు..

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో టాస్ స్కోరర్‌గా ఉన్నాకోహ్లీ… పాక్‌పై టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించిన విధానాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. కోహ్లీ మళ్లీ తన బెస్ట్ ఫామ్ అందుకోవడంపై ఇంగ్లండ్ మాజీ లెజెండ్ కెవిన్ పీటర్సన్ సంతోషం వ్యక్తం చేస్తూనే శాపం పెట్టాడు. ‘కోహ్లీ కొంతకాలం ఫామ్ కోల్పోయినప్పుడు నేను అతనికి చాలా మద్దతునిచ్చా. కానీ ఇప్పుడు మాత్రం గురువారం నాడు సెమీఫైనల్‌లో అతను ఆడకూడదు అని కోరుకుంటున్నానని బాంబ్ పేల్చాడు. కోహ్లీకి ప్రేక్షకులతో పాటు, ఒక పెద్ద వేదిక కావాలి అంతే.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ కన్నా పెద్ద వేదిక ఏముంటుంది? అందుకే అతను ఇర‌గ‌దీస్తున్నాడు.

అయితే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై మాత్రం కోహ్లీ ఆడకూడదు. గురువారం రోజు మాత్రం అతని బ్యాటుకు ఆఫ్-డే అయితే చాలు’ అని పీట‌రన్స్ అన్నాడు. ఇంగ్లండ్‌తో భార‌త్ సెమీస్ ఆడుతున్న నేప‌థ్యంలోనే ఇలాంటి కామెంట్స్ చేశాడ‌ని భావిస్తున్నారు. అయితే కేపీ శాపం కోహ్లీకి తగులుతుందేమో అని ఫ్యాన్స్ కొంద‌రు భయపడుతున్నారు. అయితే ‘కోహ్లీ వంటి ఆటగాడు ఫామ్ అందుకోవడం కేవలం భారత్‌కే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు శుభపరిణామంగా మారింది.

also read news: 

ఏ దేవతలకు ఏ నైవేద్యములు పెట్టాలి.

పిల్లలు ఇష్టపడే స్వీట్ నూడుల్స్ రెడీ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News